విధాత, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ నిర్వహించారు. ఈ సందర్భంగా 10కే రన్ ప్రారంభించి ప్రధాని మోదీ పిలుపు మేరకు ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా ఒక మొక్క నాటారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తెలంగాణాలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అనేక సందర్భాల్లో తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులను నిర్మించాలనే అంశం వచ్చిందన్నారు. తెలంగాణ ఇతర ఎయిర్ పోర్టుల నిర్మాణానికి మేము ప్రణాళికలు రెడీ చేస్తున్నాం.. త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. అలాగే విమానాశ్రయాల భద్రతలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రయాణికులు సైతం విమానాశ్రయాల్లో తనిఖీలు, భద్రత పట్ల అవగాహన కలిగి ఉండి.. భద్రతా సిబ్బందికి సహకరించాలని కోరారు. చంద్రబాబు హయాంలోనే శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బీజం పడిందని తెలిపారు. అప్పుడు ఇంత భూమి ఎందుకు కేటాయించారని పలువురు విమర్శలు చేశారన్నారు. చంద్రబాబు దూరదృష్టితోనే శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ స్థాయిలో టాప్ 10లో ఒకటిగా, దేశంలో నాల్గవ అతిపెద్ద ఎయిర్ పోర్టుగా పేరు వచ్చిందని చెప్పారు. దేశంలో 2014కు ముందు 60మిలియన్ల మంది విమానాల్లో ప్రయాణించారని, గత పదేళ్ల నుంచి 160 మిలియన్ల ప్రయాణికులకు చేరారన్నారు. సివిల్ ఏవియేషన్ లో సెక్యూరిటీ అనేది కీలకమైందని, దాన్ని మరింతగా మెరుగుపరుస్తామన్నారు. రాష్ట్రాలు కూడా సివిల్ ఎయిర్ పోర్ట్స్ కు సపోర్ట్ చేస్తున్నాయన్నారు. సివిల్ ఏవియేషన్ మంత్రిగా నిన్న పార్లమెంట్ లో ఏవియేషన్ కు సంబంధించిన బిల్ పాస్ చేసుకున్నామన్నారు. శక్తివంతమైన ఇండస్ట్రీగా ఏవియోషన్‌ను తీర్చి దిద్దుతానని దేశంలోనే నంబర్ వన్ మినిష్టర్ గా పని చేస్తాననన్నారు. ఆగస్టు 5నుంచి 11వరకు నిర్వహించే ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్‌ను అంతా విజయవంతం చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కేంద్రమంత్రి సూచించారు.
Rammohan Naidu | తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఎయిర్ పోర్టులు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి
తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏవియేషన్ సెక్యూరిటీ కల్చర్ వీక్ నిర్వహించారు.

Latest News
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
వైజాగ్‌లో ‘యుఫోరియా’ సాంగ్ లాంచ్ ఘనవిజయం –
తోడు కోసమే పెద్దపులి ఇంత దూరం వచ్చిందా.. వీడియో వైరల్
ఇంటి చిట్కాలతోనే చుండ్రుకు చెక్ పెట్టండి ఇలా..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు సంతోష్ రావు
సీఎం రేవంత్‌రెడ్డికి సంతోష్ రావు గూఢచారి: కవిత
శునకం విశ్వాసం.. గడ్డకట్టే చలిలోనూ యజమాని మృతదేహానికి 4 రోజులపాటూ కాపలాగా.. కన్నీరు తెప్పిస్తున్న దృశ్యం
రైలు ఆలస్యంతో పరీక్షకు గైర్హాజరు.. విద్యార్థినికి రూ.9 లక్షల పరిహారం
బిగ్ అనకొండ..చూసేయండి వీడియో
సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట : డిప్యూటీ సీఎం భట్టి