Site icon vidhaatha

కాళేశ్వరం ప్రాజెక్టు లో పెరిగిన వరద తాకిడి

విధాత:కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా మెడిగడ్డవద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీకి వరద తాకిడి భారీగా పెరిగింది.బ్యారేజీ పూర్తి సామర్థ్యం16.17tmc లకు గాను ప్రస్తుతం 8.279 tmc ల నీటి సామర్ధ్యం కలిగివుంది.ఇన్ ఫ్లో 9,38,654 క్యూసెక్కులు కాగా 65 గేట్లను ఎత్తి ఔట్ ఫ్లో 9,38,654 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.అన్నారం వద్ద నిర్మించిన సరస్వతీ బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 10.87tmc కాగా ప్రస్తుతం 4.28 tmc నీరు ఉంది.ఇన్ ఫ్లో 802300 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో 56 గేట్లు ఎత్తి 9,00,000 ఔట్ ఫ్లో నీటిని వదులుతున్నారు అధికారులు.కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద గోదావరి 11.140మీటర్ల ఎత్తున మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తోంది.

Exit mobile version