కవిత బెయిల్ పిటిషన్ తీర్పులు రిజర్వ్‌

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ కేసులో కవిత బెయిల్ తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు మే 6వ తేదీకి రిజర్వ్ చేసింది

  • Publish Date - April 24, 2024 / 05:50 PM IST

ఈడీ కేసులో తీర్పు మే 6వ తేదీన
సీబీఐ కేసులో మే 2న తీర్పు

విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ కేసులో కవిత బెయిల్ తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు మే 6వ తేదీకి రిజర్వ్ చేసింది. ఇదే కోర్టులో సీబీఐ కేసులోనూ కవిత బెయిల్ పిటిషన్ తీర్పును మే 2వ తేదీకి రిజర్వ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, బీఆరెస్‌ ఎమ్మెల్సీ కవితల జ్యుడీషియల్ కస్టడీని 14రోజుల పాటు మే 7 వరకు కోర్టు పొడిగించింది. బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ విచారణకు రాగా.. ఈడీ వాదనలు వినిపించింది.

సెక్షన్ 19 కింద కవితను చట్టబద్దంగా అరెస్టు చేశామని.. అక్రమంగా అరెస్టు చేశారనే దానిలో పసలేదని ఈడీ పేర్కొంది. అలాగే కేసుకు సంబంధించి మరికొన్ని వివరాలను ఈడీ తరపున న్యాయవాది కోర్టు ముందు ఉంచారు. దాదాపు రెండు గంటల పాటు ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. లిక్కర్ కేసులో ఎవరి పాత్ర ఏమిటో కోర్టుకు వివరించారు. అనంతరం తీర్పును స్పెషల్ కోర్టు రిజర్వ్ చేసింది. అయితే కవిత తరుపున ఏపిల్ర్ 26న ఆమె న్యాయవాది రిజైండర్‌ దాఖలు చేస్తామని తెలిపారు.

Latest News