Site icon vidhaatha

MLC Kavitha | కవిత బెయిల్ పిటిషన్ విచారణ 24కు వాయిదా.. సీబీఐకి నోటీసులు

విధాత : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. గురువారం పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐకి హైకోర్టు నోటీస్‌లు జారీ చేసింది. తదుపరి విచారణ 24కు వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 20వరకు జ్యూడిషల్ రిమాండ్ విధించింది. ఇప్పటికే లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై మే 10న ఈడీకి నోటీసులు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు.

ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ల విచారణను ఈ నెల 24న చేపట్టనున్నట్లు ఢిల్లీ హైకోర్టు తెలిపింది. కాగా ఈ కేసులో మార్చి 15వ తేదిన క‌విత‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ త‌ర్వాత ఇదే కేసులో ఏప్రిల్ 11వ తేదిన సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది. అప్ప‌టి నుంచి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉంటున్నారు క‌విత . ఇక లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత వేసిన బెయిల్ పిటిషన్లను మే 6న ట్రయల్ కోర్టు కొట్టి వేసింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Exit mobile version