Site icon vidhaatha

Kidney Racket | హైదరాబాద్ కేంద్రంగానే కిడ్నీ రాకెట్‌

కేరళ కిడ్నీ రాకెట్ కేసులో ఆసక్తికర మలుపు

విధాత: కేరళలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ వ్యవహారం హైదరాబాద్ కేంద్రంగా సాగినట్లుగా విచారణలో వెల్లడవ్వం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ నుంచి 40 మందిని ఇరాన్ తరలించి దాతలను ఆపరేషన్ తర్వారా 20రోజులకు ఇండియా పంపించినట్లుగా నిందితుడు సబిత్ వెల్లడించడంతో కిడ్నీ రాకెట్‌లో హైదరాబాద్ ప్రమేయం బయటపడింది.

ఒక్కో కిడ్నీ దాతకు 40లక్షలు డీల్ కుదిర్చి అందులో 20లక్షలు సబిత్ టీమ్‌, 10లక్షలు కేరళ టీమ్‌కు, 10లక్షలు కిడ్నీ దాతకు చెల్లింపులు జరిగేలా వ్యవహారం నడిపించినట్లుగా నిందితులు తెలిపారు. ఇప్పుడు ఈ కేసులో హైదరాబాద్ నుంచి కిడ్నీ డోనర్లుగా వెళ్లిన వారెవ్వరన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కిడ్నీ రాకెట్‌లో హైదరాబాద్ డాక్టర్ల ఒకరిద్ధరు కీలకంగా వ్యవహారించారని తెలుస్తుంది. కేరళా పోలీసులు హైదరాబాద్ చేరుకుని కేసు విచారణ కొనసాగిస్తున్నారు.

Exit mobile version