Site icon vidhaatha

Telangana | ఏసీబీకి చిక్కిన కుషాయిగూడ సీఐ, ఎస్‌ఐలు

విధాత : హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో భూ వివాదం కేసులో రూ. 3లక్షలు లంచం తీసుకుంటుండగా సీఐ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఉపేందర్‌లను పట్టుకున్నారు. భూ వివాదం పరిష్కారం కోసం పోలీసు అధికారులు ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేసుకుని అతని ద్వారా లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీ గుర్తించింది. గతంలో వీరిపై ఉన్న ఆరోపణలపై కూడా దృష్టి సారించారు. గుర్రంగూడ సమీపంలో ఉన్న ఇన్స్పెక్టర్ వీరస్వామి నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కుషాయిగూడ స్టేషన్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

Exit mobile version