బస్ స్టేషన్‌లో పుట్టిన చిన్నారికి లైఫ్ టైమ్ ఫ్రీ బస్ పాస్‌ … ప్రకటించిన ఆర్టీసీ యాజమాన్యం

కరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రకటించింది

  • Publish Date - June 19, 2024 / 03:43 PM IST

విధాత, హైదరాబాద్‌ : కరీంనగర్ బస్ స్టేషన్‌లో పుట్టిన చిన్నారికి తమ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్‌ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్ లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు.. ఈ చిన్నారికి బర్త్ డే గిఫ్ట్ లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్‌ మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. ఈనెల 16న కరీంనగర్ బస్ స్టేషన్లో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి చీరలు అడ్డుకట్టి కాన్పు చేసి మానవత్వం చాటిన తమ సిబ్బందిని టీజీఎస్ఆ ఆర్టీసీ యాజమాన్యం బుధవారం హైదరాబాద్ బస్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించారు. సకాలంలో కాన్పు చేసిన ఆర్టీసీ సిబ్బంది సైదమ్మ, లావణ్య, స్రవంతి, భవాని, రేణుక, రజనీ కృష్ణ, అంజయ్య సేవలను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవాతర్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమని అభినందించారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు.. వారికి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని ప్రశంసించారు.. ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఉషారాణి, తదితరులు ఉన్నారు.

Latest News