Site icon vidhaatha

Etela Rajender | బీఆరెస్‌కు రాష్ట్రంలో మనుగడ లేదు: ఈటల

విధాత : అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ఆరు గ్యారెంటీలలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్పా మిగిలినవి ఏవీ అమలు చేయడం లేదన్నారు. సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్‌, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సమావేశంలో ఈటల పాల్గొన్నారు.

సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్‌ కుంటుపడిందన్నారు. బీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో మనుగడ లేదన్నారు. నిరుద్యోగుల సమస్యలపై, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలపై, పట్టభద్రుల సమస్యలపై వీటన్నంటిపై శాసనమండలిలో ప్రస్తావించగలిగే శక్తి, ఆ నైపుణ్యం, ఆ అనుభవం ప్రేమేందర్‌రెడ్డికి మాత్రమే ఉన్నదన్నారు.సమస్యలపై పోరాటం చేసే పార్టీ బీజేపీ అని ప్రేమేందర్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version