Site icon vidhaatha

బీజేపీ, అస‌దుద్దీన్‌ ఒక్క‌టే.. దుమారం రేపుతున్న ఎంఐఎం నేత ఆరోప‌ణ‌లు

విధాత‌: బీజేపీ అస‌దుద్దీన్‌ ఒక్క‌టే అని ఎంఐఎం నేత ఖాజా బిలాల్ సంచలన ఆరోపణలు చేశారు. గోషామహల్ నుంచి పోటీ చేస్తానంటే అసదుద్దీన్ ఓవైసీ టికెట్ ఇవ్వలేదన్నారు. గోషామహల్ నియోజ‌క‌వ‌ర్గంలో 80వేల ముస్లీం ఓట్లు ఉన్నాయి, కానీ అక్క‌డ నుంచి ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదని ఖాజా బిలాల్ ప్ర‌శ్నించారు.


బీజేపీ, ఎంఐఎం ప‌థ‌కం ప్రకారమే బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ పై అసదుద్దీన్ ఓవైసీ అభ్యర్థిని ప్రకటించలేదని ఆరోప‌ణ చేశారు. గోషామహల్ లో ఎంఐఎం అభ్యర్థిని ప్రకటించకపోవడం వెనుక కుట్ర ఉందన్నారు. ఎన్నిక‌లు దెగ్గ‌ర ప‌డ‌టంతో ఖాజా బిలాల్ చేసిన ఆరోప‌ణ‌లు రాష్ట్ర రాజ‌కీయాల్లో దుమారం రేపుతున్నాయి.

Exit mobile version