Site icon vidhaatha

పెట్టుబడులతో వచ్చే తెలంగాణ ఎన్నారైలకు రెడ్ కార్పెట్‌: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వేడుకల ప్రారంభోత్సం

విధాత, హైదరాబాద్: అమెరికాలోని వాషింగ్టన్ డీ.సీ సియాటెల్ లో జరుగుతున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్‌లో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డిలు సందడి చేశారు. ముఖ్య అతిధిగా హాజరైన వెంకట్‌రెడ్డి ఈ మెగా కన్వెన్షన్‌ను ప్రారంభించగా, ఆయనతో పాటు మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, మదన్ మోహన్‌, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు పైళ్ల మల్లారెడ్డి, టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ఎక్కడ ఉన్నా తెలంగాణ బిడ్డలంతా కలిసిమెలిసి ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసీలు అనునిత్యం కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్‌తో సకల సౌకర్యాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు.

Exit mobile version