Site icon vidhaatha

N. Uttam Kumar Reddy | ఉమ్మడి నల్లగొండ పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత : మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేస్తామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా పరిధిలోని అడవిదేవులపల్లి మండలం కృష్ణానది పరిధిలోని దున్నపోతుల గండి వద్ద తలపెట్టిన ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో జిల్లా ప్రాజెక్టులపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఎంపీగా మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ఆశించినంతగా అభివృద్ధి చేయలేదన్నారు. దున్నపోతుల గండితో పాటు మిర్యాల గూడ నియోజకవర్గం పరిధిలోని ఐదు లిఫ్టు పథకాలను 460కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ వేసి కెబినెట్ ముందుకు తీసుకెళ్లి నిధులు విడుదల చేపిస్తానన్నారు. వచ్చే ఆగస్టు 15 నాటికి ఈ పథకాలను పూర్తి చేస్తామన్నారు.
ఎస్‌ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టును వందశాతం పూర్తి చేయిస్తానన్నారు. ఎస్‌ఎల్బీసీ టన్నెల్ రెండు వైపుల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. డిండి ప్రాజెక్టు ద్వారా మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని ఉదయ సముద్రం ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామన్నారు.

Exit mobile version