ఆర్టీసీ బలోపేతానికి కొత్త బస్సులు..3035ఉద్యోగాల భర్తీ
రవాణా శాఖ మంత్రి పొన్నం వెల్లడి
దసరా లోపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు 30 డీలక్స్ బస్సులు, 30 ఎక్స్‌ప్రెస్ బస్సులు
నల్లగొండ నుంచి తిరుపతి, హైదరాబాద్ లకు ఏసీ బస్సులు
మంత్రి కోమటిరెడ్డితో కలిసి కొత్త బస్సులకు ప్రారంభోత్సవం
విధాత, హైదరాబాద్ : ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన రూ.280 కోట్లలో ఇప్పటికీ కేవలం రూ.80 కోట్లు మాత్రమే ఇచ్చామని, మిగతా రూ.200 కోట్లు ఈనెల చివరి నాటికి అందజేస్తామని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్సు డిపోలో నల్గొండ- హైదరా బాద్ కు ఒక ఏసీ బస్సును, 4 డీలక్స్ బస్సులను, అలాగే పల్లె వెలుగు బస్సును జిల్లా మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తో కలిసి పొన్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంతి పొన్నం మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నడపడంలో ఎదురవుతున్న ఆర్థికంగా ఇబ్బందులు వల్ల ఆర్టీసీకి బకాయిల చెల్లింపు ఆలస్యమైందని, అందుకు క్షమించాలని ఆర్టీసీ కుటుంబ సభ్యులను కోరుతున్నానన్నారు.
జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి నాన్ స్టాపులు బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని నార్కెట్‌పల్లి బస్ డిపోకు పూర్వ వైభవం తీసుకురావడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ను ఆదేశించారు. నల్గొండ జిల్లాకు వచ్చే దసరా నాటికి 30 డీలక్స్ బస్సు లు, మరో 30 ఎక్స్ ప్రెస్ బస్సులను మంజూరు చేస్తా మని, అలాగే నల్లగొండ నుంచి హైదరాబాద్, తిరుపతిలకు ఏసీ బస్సులను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. నల్లగొండ జిల్లాలో 7 బస్సు డిపోలు ఉన్నాయని, 645 బస్సులు నిత్యం 2లక్షల 55000 కిలోమీటర్ల ప్రయాణించి, 3 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఆర్టీసీ బలోపేతంకై పటిష్ట చర్యలు
నూతనoగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా టైన తర్వాత నష్టాలలో నడు స్తున్న ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు అన్ని రకాల పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడించారు. ఆర్టీసీ సంస్థను, కార్మికులను సంరక్షించేందుకు నూతన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నదన్నారు. రాష్ట్రప్రభుత్వం ఏర్పాటై న 48 గంటలలోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, నూతనంగా 1000 బస్సులను కొనుగోలు చేశామని, మరో 1500 బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంలో భాగంగా 21% డీఏని ఇచ్చామని, 280 కోట్ల బకాయిల 80 కోట్లు ఇది వరకే ఇవ్వడం జరిగిందని, 200 కోట్ల రూపాయ లను ఈ నెలాఖ రునాటికి వారి వారి ఖాతాలలో జమ చేస్తామని మంత్రి వెల్లడించారు.
ఆర్టీసీ బలోపేతంలో భాగంగా నూతనంగా 3035 ఉద్యోగా లను భర్తీ చేయనున్నట్లు మంత్రి పేర్కొ న్నారు. ఆర్టీసీని నష్టాల నుంచి బయటకు తీసుకు వచ్చే విధంగా ప్రభుత్వ సహకారంతో ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. అన్ని జిల్లాల నుండి హైదరాబాద్‌కు ఏసీ బస్సు లు నడపాలని నిర్ణయం తీసుకున్నామని, అవసరమైతే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రాష్ట్ర రాజధానికి ఏసీ బస్సులను నడుపు తామని, ముందుగా జిల్లా కేంద్రాల నుండి ఏసీ బస్సు సౌకర్యా న్ని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం లోని అన్ని మండల కేంద్రాల నుండి జిల్లా కేంద్రాలకు ,జిల్లా కేంద్రాల నుండి హైదరాబాద్ కు ఎలాంటి లోటు పాట్లు లేకుండా బస్సులు నడిపి ప్రయాణికులను సురక్షితంగా చేర వేస్తామని చెప్పా రు.
100బస్సులు మంజూరీ చేయాలి
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్ధతుగా నిలిచిన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల కోసం కొత్తగా 100 బస్సులను మంజూరు చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నంకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ తర్వాత ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు, 35 లక్షల జనాభాను కలిగి అతి పెద్ద జిల్లాగా నల్గొండ ఉందని, అందువల్ల నల్గొండ జిల్లాకు ప్రత్యేకంగా 25 బస్సులతో పాటు, నార్కెట్ పల్లి ఆర్టీసీ డిపోకి పునర్ వైభవం తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండవ రోజే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందని, 60 నుండి 70 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు.
టీజీ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు .అప్పుల్లో ఉన్న ఆర్టీసీని పైకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్య లు తీసుకుంటున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణ చంద్ర, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఆర్టీసీ ఆర్‌ఎం రాజశేఖర్, డిప్యూటీ ఆర్‌ఎం శివ శంకర్, ఆర్టీసీ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.