విధాత ప్రతినిధి ఉమ్మడి ఆదిలాబాద్: దేశంలో కుల వివక్ష ఉండేదని కుల వ్యవస్థను రూపుమాపి దళితులను, పేదలను అంబేద్కర్ ఆదుకున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పేర్కొన్నారు .మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్,రామకృష్ణపూర్ లో అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 133వ జయంతి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన పంచశీల జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ .. ఎమ్మెల్యేగా మొదటిసారి మందమర్రి అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అంబేద్కర్ అందరికి స్ఫూర్తి, దారి చూపిన మహనీయుడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకా వెంకటస్వామి అనేక అంబేద్కర్ కాంస్య విగ్రహాలు ఇచ్చారన్నారు. ఇప్పటి వరకు తాను 110 అంబేద్కర్ విగ్రహాలు ఇచ్చానని, విగ్రహాలు పంపిణీ చేసే వరం ఆ దేవుడు కల్పించాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, అంబేద్కర్ ఉత్సవ కమిటీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
కుల వివక్షను రూపుమాపిన మహానీయుడు అంబేద్కర్: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్
దేశంలో కుల వివక్ష ఉండేదని కుల వ్యవస్థను రూపుమాపి దళితులను, పేదలను అంబేద్కర్ ఆదుకున్నారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పేర్కొన్నారు

Latest News
‘పొలిటికల్ చౌరస్తా’లో కొండా ఫ్యామిలీ.. కొత్త పార్టీ పెడతారా?
DELULU Teaser: అత్తాపూర్ నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా.. కడుపుబ్బా నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్!
రేవంత్ వెయ్యి రోజుల పాలనలో సాధించింది మహిళా మంత్రి బర్తరఫ్ : జగదీశ్ రెడ్డి
కృష్ణాష్టమి కానుకగా ‘కృష్ణంభజే’ ఫస్ట్ లుక్ లాంచ్
మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు
పూరీ బీచ్ లో నవనీత చోరుడు బాల కృష్ణుడి అద్బుత ఇసుక శిల్పం !
నాపై వేటుకు మల్లు రవినే కారణం : చిన్నారెడ్డి ఫైర్
దమ్ముంటే రాజీనామా చేయ్.. కొండాకు బస్వరాజు సారయ్య సవాల్
త్వరలో బిగ్ అప్డేట్ : కొండా సురేఖ
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ రివ్యూ