Dr Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌ను అమెరికాలోని న్యూయార్క్ సిటీ గౌరవించింది. ఆయన జయంతి అయిన ఏప్రిల్ 14వ తేదీని ఏటా ఉత్సవంగా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. సబ్బండ వర్ణాల సమ న్యాయానికి, సమానతకు ప్రతీకగా నిలిచే అంబేద్కర్ జయంతిని అధికార దినంగా నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. కుల దోపిడీకి వ్యతిరేకంగా ‘బోధించు.. పోరాడు, సమీకరించు.. అన్న పిలుపుతో ఆయన చేసిన కృషిని ఎరిక్ ఈ సందర్భంగా కీర్తించారు. అనేక తరాల ప్రజలు ప్రపంచ దేశాల నుంచి సముద్రాలు దాటుకుని కొత్త అవకాశాల కోసం న్యూయార్క్ నగరానికి వచ్చారని ఆయన చెప్పారు. కుల వివక్షను అంబేద్కర్ వ్యతిరేకించారని, భారతదేశంలోని రైతులు, కౌలు రైతుల రక్షణకోసం పనిచేశారని అన్నారు. సామాజిక వివక్షపై పోరాటంలో తన జీవితాన్ని అంబేద్కర్ అంకితం చేశారని, మహిళలు, కార్మికులు, అణగారిన వర్గాలకు సమాన హక్కుల కోసం అవిశ్రాంతంగా పనిచేశారని కొనియాడారు. భారత దేశ రాజ్యాంగాన్ని తయారు చేయడం న్యాయం, సమానత్వంపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి తార్కాణమని పేర్కొన్నారు. సుమారు ఎనిమిదిన్నర కోట్ల మంది నివసించే న్యూయార్క్ నగరం కూడా అంబేద్కర్ జయంతిని అధికారిక కార్యక్రమంగా ప్రకటించడంతో పార్లమెంటులు, ఐరాస మిషన్లు, విద్యాసంస్థలు మొత్తంగా 100 దేశాల్లో అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తున్నట్టయింది. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంతి రాందాస్ అథవలే.. అంబేద్కర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని న్యూయార్క్ నగర కార్పొరేషన్ నిర్ణయం తీసుకోవడం చారిత్రక సందర్భమని వ్యాఖ్యానించారు.
Dr Ambedkar | అంబేద్కర్‌ను గౌరవించిన న్యూయార్క్ సిటీ.. అధికారికంగా ఇక జయంతి కార్యక్రమం
Dr Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌ను అమెరికాలోని న్యూయార్క్ సిటీ గౌరవించింది. ఆయన జయంతి అయిన ఏప్రిల్ 14వ తేదీని ఏటా ఉత్సవంగా నిర్వహించనున్నట్టు ప్రకటించింది. సబ్బండ వర్ణాల సమ న్యాయానికి, సమానతకు ప్రతీకగా నిలిచే అంబేద్కర్ జయంతిని అధికార దినంగా నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. కుల దోపిడీకి వ్యతిరేకంగా ‘బోధించు.. పోరాడు, సమీకరించు.. అన్న పిలుపుతో ఆయన చేసిన కృషిని ఎరిక్ ఈ సందర్భంగా కీర్తించారు. […]

Latest News
బిగ్ బాస్‌లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్..
ప్రొఫెసర్ లైంగికదాడి.. గర్భం దాల్చిన బీఈడీ విద్యార్థిని
చలికాలంలో వేడి నీళ్లతో స్నానమా..? ఈ నష్టాలు తప్పవు..!
ఇంటర్నేషనల్ స్టేజ్‌లో మెరుపు మెరిపించిన నటి ప్రగతి
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది సజీవదహనం
ఐదేళ్ల బాలుడిని చంపిన చిరుత
ఈ వారం రాశిఫలాలు.. ప్రభుత్వ ఉద్యోగం కోసం యత్నిస్తున్న ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది..!
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం