Site icon vidhaatha

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల‌

విధాత‌: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలకు 2021 జూన్‌ 3నాటికి పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో వీటికి నవంబర్‌ 9న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నవంబర్‌ 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 17న పరిశీలన జరగనుంది. 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్‌ 29న పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. తెలంగాణలో ఆకుల లలిత, మహ్మద్‌ ఫరూద్దీన్‌, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, నేతి విద్యాసాగర్‌, వెంకేటశ్వర్లు, కడియం శ్రీహరి పదవీకాలం జూన్‌ 3నాటికి ముగిసింది.

Exit mobile version