Nagarjun Sagar | నాగార్జున సాగర్ ఎడమకాలువకు నీటి విడుదల

Nagarjun Sagar | విధాత: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి కృష్ణా నది వరద ఉదృతి కొనసాగుతున్న నేపధ్యంలో ఎన్నెస్పీ అధికారులు ఎడమ కాలువకు నీటి విడుదల చేశారు. నాగార్జున సాగర్ జలాశయం నీటిమట్టం 565 అడుగులకు చేరుకోవడంతో అధికారులు తాగు నీటి అవసరాల కోసం 1000 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. క్రమంగా 2వేల క్యూసెక్కుల కు పెంచుతూ నీటి విడుదల కొనసాగించనున్నారు.
ఎడమ కాలువ కింద ఆయకట్టు రైతులు కూడా నీటి విడుదల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. తాగునీటి కోసమే కాకుంగా పంటల సాగుకు కూడా నీటి విడుదల చేయాలని ఆయకట్టు రైతులు, కోరుతున్నారు.

నాగార్జున సాగర్ జలాశయం గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 565 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 245టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 98,293 క్యూసెక్కులు కాగా..అవుట్ ఫ్లో 31,876క్యూసెక్కులు, జల విద్యుత్తు కేంద్రంలో ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.