Site icon vidhaatha

దానాపూర్‌లో మళ్లీ పోడు రైతుల ఆందోళన

విధాత, హైదరాబాద్‌ : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దానాపూర్‌లో అటవీశాఖ అధికారులు, పోడు రైతులమధ్య గొడవతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అటవీ భూముల సర్వేకు వెళ్లిన అధికారులను పోడు రైతులు అడ్డుకుని వారితో వాగ్వివాదానికి,తోపులాటకు దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది. తరతరాలుగా తమ సాగు చేసుకుంటున్న తమ భూముల్లో సర్వేలు చేయానికి వీళ్లేదని పోడు రైతులు అడ్డుకున్నారు. గ్రామం పరిధిలో దాదాపు 160 ఎకరాల భూమిని ఈ గ్రామానికి చెందిన దాదాపు 60 కుటుంబాల రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు అటవీశాఖ అధికారులు శుక్రవారం దానాపూర్‌ వెళ్లగా గ్రామస్తులు వారిని అడ్డుకోవడంతో అటవీ అధికారులు వెనుతిరిగారు.

Exit mobile version