Site icon vidhaatha

Ram Gopal Varma | సీఎం రేవంత్‌రెడ్డితో దర్శకుడు రాంగోపాల్ వర్మ భేటీ

విధాత : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ భేటీ అయ్యారు. ఈనెల 19న డైరక్టర్స్ డేకు హాజరుకావాలని కోరారు. వర్మతో పాటు డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, హరీష్ శంకర్‌లు కూడా సీఎంను కలిశారు. వారితో పాటు పలువురు దర్శకులు, చిత్ర పరిశ్రమ ప్రతినిధులు కూడా ఉన్నారు.

సీఎంతో భేటీ నేపథ్యంలో ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. మై డియర్ ఫ్రెండ్, ఫైర్ క్రాకర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాను.. అంటూ సీఎంతో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది

Exit mobile version