ఏఈఈ ఎంపిక జాబితాను వెల్లడించండి టీజీపీఎస్సీ చైర్మన్‌కు ..కేటీఆర్ వినతి

ఏఈఈ సివిల్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేయాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు

  • Publish Date - July 3, 2024 / 01:48 PM IST

విధాత, హైదరాబాద్: ఏఈఈ సివిల్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఎంపిక జాబితాను వెంటనే విడుదల చేయాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌ను నందినగర్‌లోని ఆయన నివాసంలో ఏఈఈ సివిల్ రాసిన అభ్యర్థులు కలిశారు. బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో నోటిఫై చేసిన 1180 పోస్టులకు పరీక్షలు జరిగాయని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరీక్షకు సంబంధించిన ఎంపిక జాబితాను పెండింగ్‌లో పెట్టిందని అభ్యర్థులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్ సమస్యపై టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో మాట్లాడారు. సెలక్షన్ జాబితాను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. 1180 ఏఈఈ సివిల్ పోస్టుల ఎంపిక జాబితాను ప్రకటించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఒక ప్రకటనలో ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు తుది జాబితాను విడుదల చేయటం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు.

Latest News