RSP | గన్ పార్కు వద్ధకు రా.. చర్చిద్దాం.. బల్మూరికి ఆరెస్పీ సవాల్

గురుకుల టీచర్ల భర్తీలో రిలింక్విష్మేంట్ ఆప్షన్ నేను తీసుకొచ్చానన్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడటంపై బీఆరెస్ నేత ఆరెస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు.

  • Publish Date - July 3, 2024 / 02:47 PM IST

గురుకుల పోస్టుల భర్తీలో ఆరోపణలపై ఆగ్రహం

విధాత, హైదరాబాద్: గురుకుల టీచర్ల భర్తీలో రిలింక్విష్మేంట్ ఆప్షన్ నేను తీసుకొచ్చానన్న ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడటంపై బీఆరెస్ నేత ఆరెస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. బల్మూరి, ఏమన్న చదువుకున్నవా లేదా కాపీలు కొట్టి పాసయినవా భయ్యా? అంటు ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రిలింక్విష్మెంట్ ఆప్షన్ ను నేను తీసుకరాలే, అదెప్పటినుండో ఉందని, కానీ దాన్ని జాగ్రత్తగా వాడి ఎక్కడా బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా గురుకుల బోర్డులో(టీఆర్‌ఐఈఆర్‌బీ) నా హయాంలో వేలాది పోస్టులు ఒక్క లీకేజి, ఒక్క బ్యాక్ లాగ్, ఒక్క కోర్టు కేసు లేకుండా ఎలాంటి వాయిదాలు లేకుండా పారదర్శకంగా భర్తీ చేశానని తెలిపారు. ట్రిబ్ రికార్డులు పట్టుకొని నేను గన్ పార్క్ కు వస్త. ధమ్ముంటే మీరు, మీ సీఎం రండి. సాక్ష్యాలతో మాట్లాడుదామంటూ సవాల్ విసిరారు.

నేను సీఎం రేవంత్‌రెడ్డికి ముందే చెప్పానని తొందర పడి ఎల్బీ స్టేడియం డ్రామా కోసం వేల మంది నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టకండి, మొదట డీఎల్‌ భర్తీ చేసి చివర టీజీటీ/ లైబ్రరీయన్‌ల భర్తీ చేయమని సలహా ఇస్తే దానిని పెడచెవిన పెట్టిండని ఆరెస్పీ పేర్కోన్నారు. దాని పర్యవసానం 3000 మంది అన్ని అర్హతలున్నా నిరుద్యోగులుగా మారి కొంగు పట్టుకొని సీఎం ఇంటి ముందు బిచ్చమెత్తే పరిస్థితి దాపురించిందన్నారు. వాళ్ల ఇండ్లకు ఎప్పుడైనా పోయి చూసిండ్రా మీరు, వాళ్ల కుటుంబాల్లో ఎన్ని కష్టాలుంటయో?నని ప్రశ్నించారు. మీ కాంగీయులకు తెలిసిందంతా సత్యాగ్రహం చేసిన మహాత్మగాంధీ పేరుతో ఉన్న గాంధీభవన్ నుంచి రోజూ అసత్యాలే మాట్లాడడం తప్ప ఇంకొకటి కాదని మండిపడ్డారు.

Latest News