అద్భుతంగా సమ్మక్క-సారలమ్మ దేవాలయం
యుద్ధ ప్రాతిపదికనన అభివృద్ధి పనులు
ఈ అవకాశం దొరకడం నా అదృష్టం
మొక్కులు చెల్లించుకున్న మంత్రి సీతక్క
విధాత, వరంగల్ ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లోని సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని మంత్రి సీతక్క ఆదివారం సందర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించారు. మేడారం అభివృద్ధి పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ఆ పనులు వేగంగా సాగి, రాబోయే మేడారం మహా జాతరకు ముందు పూర్తవ్వాలని తల్లులను ప్రార్థించారు. జాతర సమయంలో లక్షలాది మంది భక్తులు విచ్చేసే ఈ ప్రాంతంలో సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. తల్లుల దీవెనలతో మేడారం అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని మంత్రి తెలిపారు.
గద్దెల ప్రాంగణాన్ని విస్తరించింది, అద్భుతంగా గుడిని అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన దర్శనాన్ని, సదుపాయాలను కల్పించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. సీఎం ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని, వారం క్రితమే మేడారం అభివృద్ధి పనులు మొదలయ్యాయన్నారు. జాతర రాకముందే పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారని, తల్లుల మీద మీద రోజు రోజుకి భక్తుల విశ్వాసం పెరుగుతోందన్నారు. మేడారం పనులు శాశ్వతంగా నిలిచిపోయేలా పనులు సాగుతున్నాయని, భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నామన్నారు. గుడి అభివృద్ధిలో నాకు భాగస్వామ్యం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా సీఎం కి, జిల్లా ఇంచార్జ్ ఇన్చార్జ్ పొంగులేటికి, ఎండోమెంట్ మినిస్టర్ సురేఖకి, ట్రైబల్ మినిస్టర్ అడ్లూరికి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.