Special Trains | సికింద్రాబాద్‌, విశాఖపట్నం నుంచి భారీగా సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Special Trains | వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీ పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ఇప్పటికే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విశాఖపట్నం నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, అర్సికెరె మధ్య 38 ప్రత్యేక రైళ్లు నడువనున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌ నుంచి అంటే నాంపల్లి నుంచి రైలు బయలుదేరుతుందని పేర్కొంది.

  • Publish Date - April 23, 2024 / 08:54 AM IST

Special Trains | వేసవి సెలవుల నేపథ్యంలో రద్దీ పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ఇప్పటికే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, విశాఖపట్నం నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, అర్సికెరె మధ్య 38 ప్రత్యేక రైళ్లు నడువనున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌ నుంచి అంటే నాంపల్లి నుంచి రైలు బయలుదేరుతుందని పేర్కొంది. విశాఖపట్నం-బెంగళూరు మధ్య 20 ప్రత్యేక రైళ్లు పరుగులు తీస్తాయని పేర్కొంది. హైదరాబాద్‌-అర్సికెరె (07265) మధ్య రైలు ఈ నెల 30, మే 7, 14, 21, 28, జూన్‌ 4, 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రతి మంగళవారం రాత్రి 7.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు గమ్యస్థానానికి చేరుతుందని పేర్కొంది.

అర్సెకెరి – హైదరాబాద్‌ (07266) మధ్య మే 1, 8, 15, 22, 29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు గమ్యస్థానం చేరుతుందని చెప్పింది. సికింద్రాబాద్‌-అర్సికెరె (07231) రైలు ఈ నెల 25, మే 2, 9, 16, 23, 30, జూన్‌ 6, 13, 20, 27 తేదీల్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది. రైలు ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటిరోజు 12.50 గంటలకు చేరుకుంటుంది. అర్సికెరె – సికింద్రాబాద్‌ (07232) మధ్య ఏప్రిల్‌ 26, 3, 10, 17, 24, 31, జూన్‌ 7, 14, 21, 28 తేదీల్లో శుక్రవారం మధ్యాహ్నం 2.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుతుందని వివరించింది. ఇక విశాఖపట్నం-బెంగళూరు (08549) మధ్య ఈ నెల 27, మే 4, 11, 18, 25, జూన్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో.. బెంగళూరు-విశాఖపట్నం మధ్య ఏప్రిల్‌ 28, మే 5, 12, 19, 26, జూన్‌ 2, 9, 16, 23, 30 తేదీల్లో రైళ్లు నడుస్తాయని తెలిపింది.

Latest News