Site icon vidhaatha

Agri Expo | నేడు, రేపు నల్లగొండలో రాష్ట్ర స్థాయి అగ్రీ ఎక్స్‌పో

జిల్లా కేంద్రంలో నిర్వాహణ

Agri Expo | తెలుగు రైతుబడి డిజిటల్ మీడియా ఎండీ జూలకంటి రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అగ్రీ ఎక్స్‌పో (వ్యవసాయ ఎగ్జిబిషన్‌) నల్లగొండ జిల్లా కేంద్రంలో శని, ఆదివారాల్లో కొనసాగనుంది. నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అగ్రీ ఎక్స్‌పో కోసం పలు వ్యవసాయ, అనుబంధ రంగాల కంపనీలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.

ఈ ప్రదర్శనలో 100కి పైగా దేశ, విదేశీ కంపనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. వ్యవసాయంలో వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, యంత్రాలను ప్రదర్శనకు ఉంచబోతున్నట్లుగా రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఫర్టిలైజర్స్‌, సీడ్స్‌, నర్సరీ, డ్రిప్‌, స్పీంక్లర్ల కంపనీలు, ఉద్యానవన కంపనీలు, వ్యవసాయ అనుబంధ రంగాలైన డెయిరీ, ఆక్వా, ఫౌల్ట్రీ కంపనీలు కూడా ప్రదర్శనలో తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయన్నారు.

ఉమ్మడి నల్లగొండ నుంచి 50వేల మంది ఔత్సాహిక రైతులు హాజరవుతారన్నారు. ఈ అగ్రీ ఎక్స్ పోను హైదరాబాద్‌లో నిర్వహిస్తే బాగుంటుందన్న ప్రతిపాదన ఉన్నప్పటికి..రైతులు నగరానికి రావడంలో ఇబ్బందిపడకుండా మునుముందు ప్రతి జిల్లా కేంద్రాల్లో ఈ అగ్రీ ఎక్స్ పోలను ఏర్పాటు చేస్తామన్నారు.

Exit mobile version