CMs meet | ఈ నెల 6న ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ.. ఏం చర్చిస్తారో..?

CMs meet | ఈ నెల 6న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశముంది. హైదరాబాద్‌లో ఈ ఇద్దరి సమావేశం జరగనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు.

  • Publish Date - July 2, 2024 / 09:18 AM IST

CMs meet : ఈ నెల 6న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశముంది. హైదరాబాద్‌లో ఈ ఇద్దరి సమావేశం జరగనున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తుందని, విభజన చట్టం అమలులో భాగంగా అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని, వాటికి పరిష్కారం కనుగొనేందుకు ఈ నెల 6న సాయంత్రం హైదరాబాద్‌లో సమావేశం అవుదామని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

అంతేగాక ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేద్దామని ఆ లేఖలో రాశారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరం కలసి కూర్చుని కొన్ని సమస్యలకు పరిష్కారానికి చర్చిద్దామని కోరారు. ఈ చర్చలు సత్ఫలితాలనిస్తాయని ఆశిస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల సమగ్రాభివృద్ధి దిశగా పరస్పర సహకారం అవసరమని, అందుకే సమావేశమై చర్చిద్దామని చంద్రబాబు తన లేఖలో కోరారు. ఆ మేరకు ఈ నెల 6న సాయంత్రం హైదరాబాద్‌లో ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ జరిగే అవకాశం ఉన్నది.

Latest News