సా..గుతున్న వైన్స్ టెండర్లు..ఫీజు పెంపుతో వెనుకడుగు వేస్తున్న దరఖాస్తు దారులు

వైన్స్ టెండర్లు ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఫీజు లక్ష రూపాయలు పెంచడంతో ఆశావాహులు వెనకడుగు వేస్తున్నారు. మద్యం షాపు టెండర్ల కోసం గత నెల నోటిఫికేషన్ విడుదల చేసి ఇరవై రోజులైనా జిల్లా వ్యాప్తంగా 83 దరఖాస్తులే వచ్చాయి

జనగామ, అక్టోబర్ 15 (విధాత): వైన్స్ టెండర్లు ఎప్పుడెప్పుడా అని ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఫీజు లక్ష రూపాయలు పెంచడంతో ఆశావాహులు వెనకడుగు వేస్తున్నారు. మద్యం షాపు టెండర్ల కోసం గత నెల నోటిఫికేషన్ విడుదల చేసి ఇరవై రోజులైనా జిల్లా వ్యాప్తంగా 83 దరఖాస్తులే వచ్చాయి. జనగామ సెంటర్లో 38,పాలకుర్తి సెంటర్లో 18, స్టేషన్ ఘనపూర్ స్టేషన్ లో 27 అప్లీకేషన్లు వచ్చాయి. గతంలో వేసిన టెండర్ దారులకు ఎక్సైజ్ అధికారులు ఫోన్ చేస్తున్నట్లు వార్తలు దవనంలా వ్యాపిస్తున్నాయి. గత సంవత్సరం జిల్లాలో 2497 మద్యం టెండర్లు రాగా 50 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం గత సంవత్సరానికి చేరువయ్యే అవకాశం కనిపించడం లేదు. మరో మూడు రోజులు మిగిలి ఉండగా చివరి రోజు ఎక్కువ పడే అవకాశం ఉందని అనుకుంటున్నారు. టెండర్ దారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్సైజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో గతంలో వార్డుల వారిగా వేసిన మద్యం షాపులు అవార్డులలో మాత్రమే పెట్టుకోవాలని నిబంధనలు ఉండేవి కానీ ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో వేసిన టెండర్లు వార్డుల వారీగా కాకుండా ఎక్కడైనా పెట్టుకోవచ్చనే నిబంధనలు జారీ చేశారు. దీంతో మున్సిపాల్టీ పరిధిలో కొంచం దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు.