Telangana UPI Rank | యూపీఐ(UPI) లావాదేవీల్లో జూలై(July) నెలలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నాలుగో స్థానం నిలిచింది. ఈ ఒక్క నెలలో 1.26 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. డిజిటల్ పేమెంట్స్(Digital Payments) లో తెలంగాణ(Telangana) రాష్ట్రం రోజు రోజుకు దూసుకుపోతోంది. ప్రతి కొనుగోలుకు డిజిటల్ పేమెంట్ చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. డిజిటల్ పేమెంట్స్ విషయంలో 9.8 శాతంతో మహారాష్ట్ర(Maharastra) ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో 5.5 శాతం లావాదేవీలతో కర్ణాటక(Karnataka) ఉంది. ఉత్తరప్రదేశ్(Uttarpradesh) రాష్ట్రంలో 5.3 శాతం మంది డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. కిరాణా సామాను కొనుగోలు కోసం ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ ఉపయోగిస్తున్నారు. డిజిటల్ పేమెంట్స్ లో ఇది 24.3 శాతంగా ఉంది. చిట్ట చివరలో టికెట్ల కొనుగోలు కోసం ఎక్కువగా యూపీఐ లావాదేవీలపై ఆధారపడుతున్నారని ఎన్‌పీసీఐ తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా 75,743 కోట్లు యూపీఐ లావాదేవీలు జరిగాయి. అయితే జూలై వరకు ఈ లావాదేవీలు 80,919 కోట్లకు చేరాయి. ఆగస్టు 23 నాటికి ఇది 90,446 కోట్లకు చేరుకున్నాయి. భవిష్యత్తులో డిజిటల్ పేమెంట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్స్ వైపే వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత డిజిటల్ పేమెంట్స్ వైపే వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే డిజిటల్ లావాదేవీలపై ఆగస్టు నుంచి కొత్త రూల్స్ వచ్చాయి. అయినా కూడా డిజిటల్ పేమెంట్స్ పై పెద్దగా ప్రభావం చూపలేదని గణాంకాలు చెబుతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ ద్వారా ప్రతి పైసా గురించి లెక్క తెలిసే అవకాశం ఉంది.
Telangana UPI Rank : యూపీఐ లావాదేవీల్లో దేశంలో టాప్ 4లో నిలిచిన తెలంగాణ
