విధాత, హైదరాబాద్ : తెలంగాణ పర్యాటక శాఖ పర్యాటక ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో దాగి ఉన్న పర్యాటక అందాలను ఫొటోలు, వీడియోల రూపంలో పరిచయం చేసిన వారికి పర్యాటకశాఖ భారీ నగదు బహుమతులు అందించనున్నట్లు తెలిపింది. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలు వారాంతాల్లో వెళ్లేందుకు కొత్త ప్రదేశాలను అన్వేషిస్తుంటారని, ఈ నేపథ్యంలోనే 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఒక పోటీని నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ప్రజలకు పెద్దగా తెలియని జలపాతాలు, పురాతన దేవాల యాలు, ట్రెక్కింగ్ పాయింట్లు వంటి 100 కొత్త గమ్యస్థానాలను గుర్తించి, వాటి వివరాలతో ఒక కాఫీ టేబుల్ బుక్ రూపొందించడమే ఈ పోటీ లక్ష్యమని పేర్కొన్నారు.
నేచర్, వైల్డ్ లైఫ్, ఆర్ట్ అండ్ కల్చర్, హెరిటేజ్, వాటర్ బాడీస్, వంటకాలు, ఫామ్ స్టేస్, రిసార్ట్స్, స్పిరిచువల్, అడ్వెంచర్ వంటి 10 విభాగాల్లో ఎంట్రీలు పంపవచ్చని అన్నారు. ఎంచుకున్న ప్రదేశానికి సంబంధించి 3 మంచి ఫొటోలు, 60 సెకన్ల వీడియో, ఆ ప్రదేశానికి రవాణా, బస, బడ్జెట్ వివరాలతో కూడిన 100 పదాల సమాచారాన్ని పోస్టర్లో పేర్కొన్న గూగుల్ ఫామ్ లేదా సోషల్ మీడియా ఎకౌంట్లకు ట్యాగ్ చేయవచ్చని తెలిపారు.
ఉత్తమ ఎంట్రీలకు ఫస్ట్ ప్రైజ్ రూ.50 వేలు, సెకండ్ ప్రైజ్ గారూ.30 వేలు, థర్డ్ ప్రైజ్ గారూ.20 వేలు అందిస్తామన్నారు. కన్సోలేషన్ బహుమతు లుగా హరిత హోటల్స్ లో ఉచిత బస కల్పిస్తారని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు జనవరి 5లోపు ఎంట్రీలు పంపించాలని హైదరాబాద్ , రంగారెడ్డి పర్యాటక శాఖ జిల్లా అధికారి కోరారు.
ఇవి కూడా చదవండి :
Burugupally Sarpanch : కొత్త సర్పంచ్ సంచలన నిర్ణయం..ఒక్క రూపాయికే దహన సంస్కారాలు..!
Ramachandra Reddy : శభాష్ సర్పంచ్ సాబ్…ప్రమాణస్వీకారం రోజే ఇచ్చిన హామీ అమలు
