కేంద్రంతో చేతులు కలిపిన రాష్ట్రం
పోలీసు క్యాంపుల ఏర్పాటుకు కుట్ర
విధాత ప్రత్యేక ప్రతినిధి:సాధారణ జీవితం గడపుతున్న మహ్మద్ హుస్సెన్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిది జగన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్రమ అరెస్టులనుఖండించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు జగన్ విడుదల చేసిన ప్రకటన లోని వివరాలిలా ఉన్నాయి.
మంచిర్యాల పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ అక్రమ అరెస్టు చేశారు. గతంలో మావోయిస్టు పార్టీలో పని చేస్తూ అరెస్టు అయి పది సంవత్సరాల కిందట జైలు నుండి విడుదలై సాధారణ జీవితం గడుపుతున్న 73 సంవత్సరాల వయస్సున్న మహ్మద్ హుస్సేన్ ను కిడ్నాప్ చేసి ఆ తరువాత అరెస్టుగా చూపుతున్నారు.
అదాని గ్రూపునకు పాత బస్తీలో విద్యుత్ బకాయిల వసూళ్ళను ఆదాని సంస్థకు అప్పగించారు. విద్యుత్ భూగర్భ లైన్లు వేసే పని కూడా ఆదానికి అప్పగించారు. కార్పోరేట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాత ప్రజా వ్యతిరేక విధానాలు అమలు అవుతున్నాయి.
– సింగరేణి ప్రైవేటీకరణ యత్నం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్గత ఒప్పందం చేసుకుని సింగరేణి బ్లాక్ ల అమ్మకానికి సిద్ధమయ్యారు. దీనితోకార్మికులు సింగరేణి బ్లాక్ ల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. ఈ ఉద్యమాలను అణిచివేయడానికే నాయకత్వం వహిస్తున్న వారిపై మావోయిస్టుల ముద్ర వేసి అరెస్టులకు పూనుకుంటున్నారు.
డిఎస్సీ ఉద్యోగాల కోసం పరీక్షలకు ఫ్రిపేర్ కాడానికి ఒక నెల ఫోస్టుపోన్ చేయమని ప్రభుత్వాన్ని కోరిన విద్యార్థులను అరెస్టు చేసి కేసులు పెట్టారు. సామ్రజ్యవాదుల, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కొమ్ముకాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఫాసిజాన్ని అమలు చేస్తున్నారు.
– కేంద్రంతో చేతులు కలిపిన రాష్ట్రం
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతో చేతులు కలిపి ఉద్యమకారులను, విప్లవకారులను అణిచివేయడానికి ఆపరేషన్ కగార్ ను తీవ్రతరం చేస్తున్నారు.మావోయిస్టులను నిర్మూలించడానికి అదనపు సాయుధ బలగాలు, నిధులు కావాలని, ప్రత్యేక టాస్క్ ఫోర్సు క్యాంపులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచర్ల మండలం కొండవాయి గ్రామంలో, ములుగు జిల్లా, వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో ఏర్పాటు చేయాలని, వామ పక్ష తీవ్రవాద జిల్లాలుగా గతంలో వుండి తొలిగించిన మూడు జిల్లాలను సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్ పెండెచర్(ఎస్ఆర్తోస్ఈ) స్టేటస్ ను తిరిగి కొనసాగించాలని కేంద్రహోం మంత్రి అమిత్ షాను కలిసి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్య మంత్రి కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండంటూ ఆ ప్రకటనలో జగన్ కోరారు.