Site icon vidhaatha

వెంకట్‌రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉంది: ఉత్తమ్

రేవంత్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా
ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
నాకు సీఎం పదవిపై ఆశలేదన్న వెంకట్‌రెడ్డి

విధాత, హైదరాబాద్ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భవిష్యత్తులో సీఎం అయ్యే అర్హత ఉందని, సీఎం రేవంత్ రెడ్డి భువనగిరిలో వెంకట్‌రెడ్డికి సీఎం అర్హత ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నాని మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయన్నారు. బుధవారం నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి నామినేషన్ ర్యాలీలో ఉత్తమ్ మాట్లాడుతూ వెంకట్‌రెడ్డికి మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే అదే వేదికపై ఉన్న వెంకట్‌రెడ్డి తనపై ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తనకు ముఖ్యమంత్రి పదవిపై ఆశ లేదని, సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని స్పష్టం చేశారు. ఉత్తమ్ నా పట్ల అభిమానంతో అలా మాట్లాడారన్నారు. నన్ను నల్గొండ ప్రజలు ఇన్నాళ్లుగా గెలిపిస్తూ చూపించిన అభిమానం చాలని, పదవులపై నాకు ఆశ లేదని, గతంలో తెలంగాణ కోసం 11రోజులు ఆమరణ దీక్ష చేసి మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు. మంత్రిగా తాను నిర్వరిస్తున్న పదవి నాకు చాలన్నారు.

Exit mobile version