Site icon vidhaatha

Etela Rajender | ఈటలకే వీరశైవలింగాయత్‌ల మద్దతు

etela rajender

విధాత : మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు పలు ప్రజాసంఘాలు, సామాజిక వర్గాల మధ్ధతు పెరుగుతుంది. తాజాగా మల్కాజిగిరి నియోజకవర్గంలో వీరశైవలింగాయత్‌లు పార్లమెంటు ఎన్నికల్లో తమ మద్దతును బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ప్రకటించారు. వీరశైవలింగాయత్‌ సమాజం అధ్యక్షుడు ఆలూరే ఈశ్వర ప్రసాద్‌ మల్కాజిగిరిలోని తన నివాసంలో వీరశైవలింగాయత్‌లతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటలకు మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రిగా, ఉద్యమకారుడిగా, ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడిగా అనుభవం కలిగిన ఈటల రాజేందర్‌కు తమ వీరశైవలింగాయత్‌ల సమాజం పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో తమ కుటుంబాలు సుమారుగా మూడు వేల వరకు ఉంటాయని, బీజేపీకి పూర్తి మద్దతు తెలుపుతామని పేర్కోన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా కాబోతున్నారని, కేంద్రంలో బీజేపీ ప్రధానిగా మోదీ సర్కార్‌ ఉంటేనే దేశపురోభివృద్ధిని సాధిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో పలువురు లింగాయత్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Exit mobile version