విధాత: అధిక వడ్డీ ఆశ చూపి..10కోట్ల వరకు డబ్బులు తీసుకుని తప్పించుకు తిరుగుతున్న వడ్డీ వ్యాపారి బాలాజీ నాయక్ ఇంటిపై బాధితులు దాడి చేసి ఫర్నిఛర్ ధ్వసం చేశారు. ఈ ఘటన నల్గొండ జిల్లా, పెద్ద అడిశర్లపల్లి మండలం, పడమటి తండాలో చోటు చేసుకుంది. వడ్డీ వ్యాపారి బాలాజీ నాయక్ అమాయక గిరిజనులకు అధిక వడ్డీ ఆశ చూపి.. 10 కోట్ల వరకు పలువురి నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఆపై పథకం మేరకు ఐపీ పెట్టి.. బాధితుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు.
వద్దిపట్లకి చెందిన బాధితుడు 80 లక్షలు ఇవ్వగా.. అసలు, వడ్డీ ఇవ్వకుండా బాలాజీనాయక్ ఫోన్ స్విచ్చాఫ్ చేయడంతో.. ఆందోళనకు గురై పురుగులమందు తాగి చనిపోయాడు. ఆగ్రహించిన బాధితుడి కుటుంబీకులు.. బాలాజీనాయక్ ఇంటిపై దాడిచేసి నిప్పుపెట్టారు. బాలాజీ నాయక్ మోసాలపై గతంలో పోలీసులకు పిర్యాదు చేసిన.. పట్టించుకోలేదని విమర్శించారు. ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కొందరు పోలీస్ అధికారులు బాలాజీ నాయక్ ను వెనకేసుకొచ్చి ..బాధితులకు అన్యాయం చేశారని వారు ఆరోపించారు.