విధాత, వరంగల్ ప్రతినిధి:మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మ తండా కు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క సోమవారం పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం బాలిక పై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన జరిగింది. ఈ రోజు బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాలిక కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామి ఇచ్చారు. బాలిక మృతికి కారకులను కఠినంగా శిక్షిస్తామన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.
రాష్ట్రంలో గంజాయి,మత్తు మాఫియాలను ఉక్కు పాదంతో అణిచి వేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అఘాయిత్యాలు జరగకుండా వాటి మూలాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపి బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మత్తు మాఫియాను అణిచివేస్తాం.. బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన .. మంత్రి సీతక్క
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లక్ష్మ తండా కు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క సోమవారం పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం బాలిక పై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన జరిగింది.

Latest News
ఖాతాదారులకు అలర్ట్.. బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు..!
స్మృతి మాజీ లవర్ దర్శకత్వంలో కొత్త సినిమా..
స్నానంతోనూ డబ్బు సంపాదించొచ్చు..!
బుధవారం రాశిఫలాలు.. ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్త..!
‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయంపై మెగాస్టార్ భావోద్వేగ స్పందన
చిలకపచ్చ చీరలో కేక పెట్టిస్తున్న మాళవిక మోహనన్
చీరకట్టులో హీట్ పెంచిన నిధి అగర్వాల్
ఢిల్లీ గెలుపు : ముంబైకి వరుసగా మూడో పరాజయం
ఇది బ్లాక్బస్టర్ కాదు… ‘బాస్బస్టర్’! – అల్లు అర్జున్
రూ.10 కోట్ల లాటరీ గెలిచిన డ్రైవర్ : రాత్రికిరాత్రే మారిపోయిన జీవితం