Site icon vidhaatha

Telangana | బస్సులో గర్బిణీకి ప్రసవం. నర్సు సాయంతో పురుడు పోసిన కండక్టర్‌

Telangana | రాఖీ పౌర్ణమి (Rakhi Purnima) రోజున టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) బస్సులో ప్రయాణిస్తున్న గర్బిణీకి కండక్టర్ చొరవ తీసుకుని పురుడు పోసిన ఘటన చోటుచేసుకుంది. గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి (Gadwal Wanaparthy) రూట్ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్బిణీ రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తుంది. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణీకి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి. భారతి బస్సును ఆపించి, అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్బిణికి పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డకు ఆ మహిళ జన్మనిచ్చింది.

అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు. బస్సులో గర్బిణీకి సకాలంలో ప్రసవం చేసి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా కృషి చేసిన కండక్టర్ భారతికి ఆర్టీసీ ఎండీ వీ.సీ.సజ్జనార్ (MD Sajjanar) ట్విటర్ ఎక్స్ వేదికగా అభినందించారు. కండక్టర్‌ సమయస్పూర్తితో వ్యవహరించి నర్సు సాయంతో సకాలంలో పురుడు పోయడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవ స్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయమని కండక్టర్, తల్లీబిడ్డల ఫోటోను సజ్జనార్ పోస్ట్ చేశారు.

Exit mobile version