విధాత, హైదరాబాద్ : చెరువులో చేపలు పడుతున్న ఇద్దరు యువకులపై పిడుగు పడటంతో వారు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దమ్మపేట మండలం జమేదార్ బంజర్ గ్రామ చెరువులో ఇద్దరు యవకులు చేపలు పడుతుండగా పిడుగు పడింది. యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. భద్రాచలంలోని చర్ల వద్ద రహదారి పైకి నీరు చేరడంతో రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ఈదురు గాలుల కు చెట్లు, విద్యుత్తు స్తంభాలు విరిగి పడ్డాయి. విద్యుత్తు సరఫరా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమ యమయ్యాయి. ప్రధాన రహదారిపై పైకి మూడు అడుగుల మేర వర్షం నీరు చేరడటంతో చర్ల, దుమ్ము గూడెం మండలాల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాలు పడే సమసమయ్యంలో చెట్ల కింద ఉండకూడదని, అవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దన్నారు.
Bhadradri Kothagudem | చేపల వేటలో యువకులు పిడుగు పడి దుర్మరణం
చెరువులో చేపలు పడుతున్న ఇద్దరు యువకులపై పిడుగు పడటంతో వారు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

Latest News
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు
పక్కా స్కెచ్..నార్వార్ కోటలో 400ఏళ్ల నాటి ఫిరంగి దోపిడీ !
వానల కోసం గాడిదలకు పెళ్లి!
స్థిరంగా బంగారం, వెండి ధరలు