పార్టీ మారాలంటూ ఒత్తిడి చేస్తున్నారు , అక్రమ కేసులతో వేధిస్తున్నారు … జనగామ ఎమ్మెల్యే బీఆరెస్ నేత పల్లా

పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తుందని జనగామ ఎమ్మెల్యే బీఆరెస్‌ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా పాల్గొన్నారు

  • Publish Date - June 23, 2024 / 04:19 PM IST

విధాత : పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తుందని జనగామ ఎమ్మెల్యే బీఆరెస్‌ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అమెరికాలోని వర్జీనియాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ మార్పు కోసం ప్రభుత్వం సాగిస్తున్న ఒత్తిళ్లు, వేధింపుల్లో భాగంగా తనపై ఆరు నెలల్లోనే నాలుగైదు కేసులు నమోదు చేశారన్నారు. నాతో పాటు నా భార్య నీలిమ, కొడుకు అనురాగ్ పైన కూడా కేసులు పెట్టారని తెలిపారు. అలాంటి వాటికి భయపడకుండా న్యాయపోరాటం చేస్తానన్నారు. ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని, కేసులు, అరెస్టులు నాకు కొత్త కాదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ నేతలు కక్షపూరిత రాజకీయాలను ప్రారంభించారని తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణాలో ఇలాంటి వాతావరణం చూడలేదని అన్నారు. బీఆరెస్‌లోకి రాక ముందు ఉద్యమంలో జేఏసీతో కలిసి పని చేశానని, నాడు ఉమ్మడి పాలకులు కేసులు పెట్టారని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో విలువలు పాటించాలని, గెలిచిన పార్టీలోనే ప్రజాప్రతినిధులు ఐదేళ్లు ఉండాలన్నారు.

Latest News