Tourist Places | జూలైలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకుంటున్నారా..? బెస్ట్‌ ప్లేసెస్‌ ఇవే..!

Tourist Places | జూలై మాసంలో నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. ఫలితంగా వర్షాలు కురుస్తుంటాయి. దాంతో ఆయా ప్రాంతాలన్నీ పచ్చికను పరచుకుంటాయి. ఈ వర్షాకాలం సీజన్‌లో చాలామంది పలు ప్రాంతాలను సందర్శించాలని భావిస్తుంటారు.

  • Publish Date - June 22, 2024 / 10:15 AM IST

Tourist Places | జూలై మాసంలో నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. ఫలితంగా వర్షాలు కురుస్తుంటాయి. దాంతో ఆయా ప్రాంతాలన్నీ పచ్చికను పరచుకుంటాయి. ఈ వర్షాకాలం సీజన్‌లో చాలామంది పలు ప్రాంతాలను సందర్శించాలని భావిస్తుంటారు. వర్షాలు కురిసే సమయంలో ప్రకృతి రమణీయ దృశ్యాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. ఈ సమయంలో పర్వతాలు, సరస్సు ప్రాంతాలకు వెళ్లి మాటల్లో చెప్పలేని ఆనందాన్ని పొందుతుంటారు. మీరు సైతం వర్షాకాలంలో ప్రకృతి అందాలను సందర్శించాలనుకుంటున్నారా..? అయితే జూలై మాసంలో సందర్శించేందుకు ఈ ప్రదేశాలు అత్యుత్తమమైన ప్రదేశాలు ఇవే.

కోటల నగరం ఉదయపూర్

జూలై నెలలో మాసంలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ని సందర్శించవచ్చు. సరస్సులు, పచ్చదనాన్ని ఇష్టపడే వారికి బెస్ట్‌ప్లేస్‌. వర్షాకాలంలో ఇక్కడ పచ్చదనం పెరగడంతో పాటు సరస్సుల అందాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఉదయపూర్‌లోని పిచోలా సరస్సుతో పాటు దాని ఒడ్డున నిర్మించిన జగ్ మందిర్ రాజభవనం. ఉదయపూర్‌లో సిటీ ప్యాలెస్‌ని సైతం సందర్శించేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రదేశంలో అనేక కోటలు ఉంటాయి. అంతేకాకుండా గార్డెన్ ప్యాలెస్‌గా పిలుచుకునే ఒక ప్రధాన రాజభవనం సైతం ఉన్నది. షీష్ మహల్, దిల్కుష్ మహల్, ఫతే ప్రకాష్ ప్యాలెస్ , మోతీ మహల్‌ను సైతం సందర్శించేందుకు అవకాశం ఉంటుంది.

హిల్‌స్టేషన్స్‌.. ముస్సోరీ

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి సైతం ప్రముఖ హిల్‌స్టేషన్స్‌లో ఒకటి. ఇక్కడున్న సహజమైన అందమైన పర్వతాలు, సరస్సులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. జూలై మాసంలో ఫ్యామిలీతో, స్నేహితులతో ఇక్కడకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ లాల్ టిబ్బా, కెంప్టీ ఫాల్స్, నాగ్ టిబ్బా, గమ్ హిల్ తదితర అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.

గాంగ్‌టక్ అందాలు చూడాల్సిందే..

జూలై నెలలో చూడాల్సిన ప్రదేశాల్లో గాంగ్‌టక్ సైతం ఒకటి. ఇది హిమాలయ శ్రేణుల్లోని శివాలిక్ కొండల నుంచి 1437 మీటర్ల ఎత్తులో ఉంటుంది. గాంగ్‌టక్‌లో ప్రకృతి అందాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ బాన్ ఝక్రి, త్సోమ్‌గో సరస్సును చంగు సరస్సుగా పిలుస్తుంటారు. తాషి వ్యూ పాయింట్ సైతం అత్యుత్తమ ప్రదేశాల్లో ఒకటి. గాంగ్‌టక్ నుంచి 49 కిలోమీటర్ల దూరంలో 12,310 అడుగుల ఎత్తులో ఉన్న త్సోమ్గో సరస్సు ఒక హిమనదీయ సరస్సు. పర్వతాలతో చుట్టుముట్టబడిన ఈ సరస్సు రంగు మారుతూ వస్తుంది. వేసవి కాలంలో ఇక్కడ పూలు వికసించి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

Latest News