Site icon vidhaatha

బాక్సాఫీస్‌, ఓటీటీల్లో సందడే సంద‌డి.. ఈ వారం ఆల‌రించే సినిమాలివే

విధాత‌: ఈ వారం బాక్సాఫీస్‌, ఓటీటీల్లో సందడే సంద‌డి నెల‌కొంది. మొద‌ట‌గా డిసెంబ‌ర్ 2న బాల‌కృష్ణ న‌టించిన అఖండ సినిమా థియేట‌ర్ల‌లోకి రానుంది. 3వ తేదీన మ‌ళ‌యాల మెగాస్టార్ మోహ‌న్ లాల్ , అర్జున్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన మ‌ర‌క్కార్, పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన ‘బ్యాక్‌ డోర్‌’, సునీల్ షెట్టీ కుమారుడు ఆహాన్ షెట్టీ న‌టించిన త‌డ‌ప్‌ హిందీ వెర్శ‌న్‌‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రాలు 4వ తేదీన నిత్యామీన‌న్, స‌త్య‌దేవ్, రాహుల్ రామ‌కృష్ణ న‌టించిన‌ స్కైలాబ్ చిత్రాలు విడుద‌ల కానున్నాయి.

ఓటీటీల్లోను ఈ వారం సినిమాలు వెబ్ సిరీస్‌లు చాలానే రానున్నాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబరు 1న లాస్‌ ఇన్‌ స్పేస్ , ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌(హాలీవుడ్‌) కోబాల్ట్‌ బ్లూ(హాలీవుడ్‌) విడుద‌ల కానుండ‌గా డిసెంబరు 3న మోస్ట్ ఎవైటెడ్ వెబ్ సిరీస్‌ మనీ హెయిస్ట్‌ 5 ఫైన‌ల్ పార్ట్ విడుద‌ల కానుంది. అదేవిధంగా జీ5లో డిసెంబర్ 3న‌ బాబ్‌ విశ్వాస్‌(హిందీ) , అమెజాన్‌ ప్రైమ్‌లో ఇన్‌ సైడ్‌ ఎడ్జ్ ఆహాలో మంచి రోజులు వచ్చాయి అనే సినిమాలు విడుద‌ల కానున్నాయి.

Exit mobile version