విధాత, : కార్తీక మాసంలో భక్తులు నాగదేవతలకు పూజలు చేయడం కొనసాగుతుంది. భక్తులు ఓ వేప చెట్టు కింద ఉన్న పుట్ట వద్ద పూజలు చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా భారీ నాగుపాము ప్రత్యక్షమవ్వడం వైరల్ గా మారింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం సమీపంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు స్థానిక పెరంపేట రోడ్డులో బాట గంగానమ్మ ఆలయ సమీపంలో వేప చెట్టు కింద ఉన్న పుట్టలో పాలు పోసి పూజలు చేస్తున్నారు. ఇదే సమయంలో పుట్ట నుంచి ఓ భారీ నాగుపాము ప్రత్యక్షమై పడగ విప్పి భక్తుల ముందు సాక్ష్యాత్కరించింది. ఆశ్చర్యపోయిన భక్తులు ఇదంతా దైవ మహిమగా భావించి భయపడకుండా ఆ నాగుపామును దర్శించుకుని పూజలు చేయడం ఆరంభించారు.
చిత్రంగా ఆ నాగుపాము కూడా భక్తుల హడావుడికి చిరాకు పడకుండా పడగవిప్పి నిశ్చలంగా నిలుచుని వారి పూజలందుకునంది. భక్తులు భక్తి తన్మయత్వంతో ఆ నాగుపాము పడగపై పసుపు కుంకుమలు చల్లినా..నీళ్లు, పాలు చల్లినా ఏమి అనకుండా తనకిది అలవాటేనన్నట్లుగా వారి పూజలను అందుకోవడం అందరిని మరింత ఆశ్చర్యపరించింది. నాగయ్య ప్రత్యక్షం సమాచారం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేస్తుండంతో ఆ ప్రాంతమంతా భక్తజన కోలాహలంతో సందడిగా మారిపోయింది. కార్తీక మాసంలో ఇలా నాగు పాము దర్శనంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాముకు పూజలు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో అరుదైన ఘటన. కార్తీక మాసం నేపథ్యంలో స్థానిక పెరంపేట రోడ్డులోని బాట గంగానమ్మ ఆలయ సమీపంలో వేప చెట్టు వద్ద నాగుపాము ప్రత్యక్షం. దీంతో నేరుగా పాముకే పూజలు చేసిన భక్తులు. pic.twitter.com/FKvVMUOC07
— ChotaNews App (@ChotaNewsApp) October 27, 2025
