Site icon vidhaatha

ఇంట్లో అద్దం ఆ దిశ‌లో ఉంటేనే మంచిదట‌..? బెడ్‌రూమ్‌లో ఉంటే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ట‌..!

అద్దం.. ఇది ప్ర‌తి ఇంట్లో ఉంటుంది. ఇక అమ్మాయిలు అయితే అద్దం ముందే వాలిపోతుంటారు. త‌మ అందాల‌ను ఆ అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంటారు. అద్దం కేవ‌లం చూసుకునేందుకే కాకుండా.. ఐశ్వ‌ర్యం, సుఖ‌సంతోషాల‌ను కూడా పెంచుతుంద‌ట‌. పాజిటివ్ ఎన‌ర్జీ కూడా పెరుగుతుంద‌ట‌. వాస్తుప్ర‌కారం అద్దాన్ని ఇంట్లో అమ‌ర్చితే దోషాలు కూడా తొల‌గిపోతాయ‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంత‌కీ వాస్తు ప్ర‌కారం.. ఇంట్లో అద్దం ఏ దిశ‌లో ఉండాలి..? ఏ ప‌రిమాణంలో ఉండాలి..? అనే విష‌యాల‌ను తెలుసుకుందాం.

వాస్తు ప్ర‌కారం.. ఇంట్లో అద్దాన్ని తూర్పు లేదా ఉత్త‌ర దిశ‌లో గోడ‌కు అమ‌ర్చడం మంచిద‌ట‌. ఈ రెండు దిక్కుల్లో మిర్ర‌ర్‌ని ఉంచితే ఆ ఇంట్లో శుభం క‌లుగుతుంద‌ట‌. ఉత్త‌ర దిశ‌ను కుబేర దిక్కుగా నిపుణులు ప‌రిగ‌ణిస్తారు. దీంతో ఆ దిశ‌లో అద్దాన్ని ఉంచ‌డంతో పాజిటివిటీతో డ‌బ్బును ఆక‌ర్షిస్తుంద‌ట‌. అంతేకాకుండా ఇంట్లో ఆనందం, శ్రేయ‌స్సు క‌లుగుతుంద‌ట‌. ద‌క్షిణ‌, ప‌శ్చిమ దిక్కుల్లో అద్దాన్ని అమర్చ‌డం ద్వారా ఆ ఇంట్లో అశాంతి నెల‌కొంటుంద‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అద్దం ఎప్పుడూ వృత్తాకారం లేదా దీర్ఘచతురస్త్రాకారంలో ఉండేలా చూసుకోవడం మంచిది అంటున్నారు వాస్తు పండితులు.

ప‌గిలిన అద్దంతో వాస్తు దోషాలు..

ప‌గిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచుకోవ‌డం ద్వారా వాస్తు దోషాలు వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఎక్క‌డైనా ప‌గిలిన అద్దం ఉంటే వీలైనంత త్వ‌ర‌గా తొల‌గించాల‌ని సూచిస్తున్నారు. ఇక బెడ్‌రూమ్‌లో మంచానికి ఎదురుగా అద్దాన్ని ఉంచుకోవ‌ద్ద‌ని చెబుతున్నారు. ఎందుకంటే మంచంపై పడుకున్న మనుషుల ప్రతిబింబాలు అద్దంలో కనిపించకూడదు. ఈ విధంగా ఉంటే నెగెటివ్ ఎనర్జీని సృష్టించడమే కాకుండా సంబంధబాంధవ్యాలు దెబ్బతింటాయ‌ని పేర్కొంటున్నారు పండితులు. 

Exit mobile version