ఆమ్రపాలి కాట(Amrapali Kata), తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్( IAS Officer, Telangana Cadre)కు ఈ రాష్ట్రంలో చాలామంది అభిమానులున్నారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లాలో. జిల్లాల పునర్విభజన తర్వాత వరంగల్ అర్బన్(Warangal Urban), రూరల్(Warangal Rural) అనే రెండు జిల్లాలుగా విడిపోయిన తర్వాత ఈ రెండు జిల్లాలకూ ఆమె కలెక్టర్‌గా పనిచేసారు. ఆ సమయంలో తను చేపట్టిన కార్యక్రమాలు, ప్రజలు, విద్యార్థులు, యువతలో చాలా పేరు తీసుకొచ్చాయి. వరంగల్‌లో గణేశ నవరాత్రులలో ఒళ్లో గణేశుడితో ఉన్న ఆమ్రపాలి(As goddress Parvati) విగ్రహాన్ని నెలకొల్పారంటే, ఆ జిల్లాల ప్రజలు ఆమెను ఎంతగా అభిమానించారో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వంలో కలెక్టర్‌గా పనిచేసాక, ఆమ్రపాలి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. అప్పటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా, ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసారు.
ఆమ్రపాలిది నిక్కచ్చి వ్యవహారం. ఆడపిల్లలకు ఆపద వచ్చిందన్నా, ఎక్కడైనా అవినీతి జరిగిందని విన్నా, విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం చూపారని తెలిసినా, చండశాసనురాలవుతుంది. మామూలుగా ప్రజలతో, విద్యార్థులతో మాట్లాడినప్పుడు ఎంత మృదువుగా వ్యవహరిస్తుందో, అధికారులతో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటుంది. మళ్లీ అంతే ప్రేమగా తన సిబ్బందిని చూసుకుంటుంది. వరంగల్‌లో తన సిబ్బంది అందరికీ, బాహుబలి–2 సినిమాను థియేటర్ మొత్తం బుక్ చేసి చూపించింది. పాఠశాలల్లో విద్యార్థులతో మాట్లాడటం(Interacting with Students) ఆమ్రపాలికి చాలా ఇష్టమైన వ్యాపకం. తరచూ ఈ పని చేస్తుండేవారు. తను మాట్లాడే మాటలు ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయని ఆయా స్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు చెప్తుంటారు. సిబ్బందిని ఔటింగ్‌లకు తీసుకెళ్లడం, వారితో కలిసి ట్రెక్కింగ్(Treckking) చేయడం ఆమ్రపాలికి చాలా ఇష్టం. వరంగల్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు జిల్లాలోని అడవుల్లో చాలాసార్లు ట్రెక్కింగ్ చేసారు. క్రమశిక్షణారాహిత్యాన్ని అస్సలు సహించదు.
బహుశా ఇవన్నీ తెలుసుకనుకనే రేవంత్ ప్రభుత్వం తనకు చాలా ముఖ్యమైన శాఖలు అప్పజెప్పింది.
తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ వ్యాప్తంగా ఐఏఎస్‌లలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆమ్రపాలి మన తెలుగు ఆడపడుచే. ఆమె స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు నగర శివారులోని ఎన్ అగ్రహారం (నర్సాపురం అగ్రహారం). విజయవాడ నుండి చెన్నై రైల్వే లైన్‌కు సమీపంలో గేటు దాటాక రెండు కిలో మీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఆమ్రపాలి కుటుంబానికి చెందిన సొంత ఇల్లు ఇప్పటికీ ఎన్.అగ్రహారంలో ఉంది.
ఆమ్రపాలి తండ్రి పేరు కాటా వెంకటరెడ్డి, విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సీటీలో ఎకనమిక్స్ ఫ్రొఫెసర్. తల్లి పద్మావతి, ఒక సోదరి(అక్క) మానస గంగోత్రి ఉన్నారు. 1982, నవంబర్ 4న జన్మించింది ఆమ్రపాలి. వెంకటరెడ్డి ఇద్దరు కుమార్తెలను బాగా చదివించారు. ఆమ్రపాలితో పాటు ఆమె సోదరి మానస గంగోత్రి కూడా 2007 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్). ఆమె ప్రస్తుతం కర్ణాటక కేడర్‌లో ఇన్‌కంట్యాక్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె ఐఆర్‌ఎస్‌లో 184వ ర్యాంక్ సాధించారు. మానస గంగోత్రి భర్త ప్రవీణ్ కుమార్‌ది తమిళనాడు.. ఆయన 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన తమిళనాడు ఐఏఎస్ కేడర్ కాగా.. ప్రస్తుతం అక్కడే పనిచేస్తున్నారు.
విశాఖపట్నంలో ఉన్నత చదువులు చదివారు ఆమ్రపాలి. చెన్నై ఐఐటీలో బిటెక్ చేసిన ఆమ్రపాలి, తర్వాత బెంగళూరు ఐఐఎంలో ఎంబిఏ కూడా చేసారు. 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె మొదటి ప్రయత్నంలోనే 39వ ర్యాంక్ సాధించారు.. అనంతరం ట్రైనీ ఐఏఎస్‌గా, జాయింట్ కలెక్టర్‌గా, నగర కమిషనర్‌గా పనిచేశారు. 2018లో వరంగల్ జిల్లా అర్బన్, రూరల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఆమె కేంద్రానికి వెళ్లి, ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసారు. ఇటీవలే మళ్లీ తెలంగాణకు తిరిగి వచ్చేశారు. ఆమ్రపాలి ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్నారు. అమ్రపాలికి 2018, ఫిబ్రవరి 18న తేదీన వివాహం జరిగింది. ఆమె భర్త జమ్మూకు చెందిన సమీర్ శర్మ(Sameer Sharma, IPS) ఆయన 2011 ఐపీఎస్ బ్యాచ్. ప్రస్తుతం ఆయన డామన్ డయ్యూ కేంద్రపాలిత ప్రాంతంలో ఎస్పీగా పనిచేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు సీనియర్ అధికారుల కన్నా ఎక్కువ పవర్ ఫుల్‌గా ఉన్న ఆఫీసర్ కాట అమ్రపాలి. తాజా బదిలీల్లో ఆమెను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా కూడా నియమించారు. ఇప్పటికే ఆమె జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీ రివర్ ఫ్రంట్ మేనేజింగ్ డైరెక్టర్, HGCL మేనేజింగ్ డైరెక్టర్ , హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కమిషనర్ గా కూడా ఉన్నారు.
తెచ్చుకున్నారు. అప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచే వరకూ కేంద్ర సర్వీసుల్లోనే ఉన్నారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత మళ్లీ ఆమె తెలంగాణ రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. మాతృ క్యాడర్ కు వచ్చినప్పటి నుంచి అమ్రపాలికి కీలక పదవులు దక్కుతున్నాయి.
ఇక్కడో విశేషముంది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్(Smitha Sabharwal, IAS) హవా నడిస్తే, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఆమ్రపాలి అధికారాలు నడుస్తున్నాయి. ఇద్దరూ సమర్థులైన అధికారిణులే. ప్రస్తుతం లూప్లైన్లో ఉన్న స్మిత కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.