EXPLAINED | కామన్ రెవెన్యూ కోడ్‌పై నిర్లక్ష్యం.. వంద చట్టాలతో సతమతం!

ధరణి పుణ్యమా అని రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారి పాస్ బుక్‌లు కూడా వచ్చాయి. ఇలాంటి అనుమానిత లావాదేవీలపై విచారణ జరిపేందుకు ఫోరెన్సిక్ విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వివాదాస్పద భూముల లావాదేవీలకు సంబంధించి అక్రమాలను వెలికితీసేందుకు విచారణ చేయిస్తామని చెప్పి రెండేళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు విచారణకు ఆదేశించలేదు.

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

EXPLAINED | ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కామన్ రెవెన్యూ కోడ్ అమలు చేస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏపీ ల్యాండ్ రెవెన్యూ కోడ్‌ను సిద్ధం చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో భూ వివాదాలకు ఫుల్ స్టాప్‌ పెట్టేందుకు తెలంగాణ కామన్ రెవెన్యూ కోడ్ ప్రవేశపెడితే బాగుంటుందని ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ ఏకాభిప్రాయానికి వచ్చింది. రెవెన్యూ రిటైర్డ్‌ అధికారులు కూడా ఈ విధానం బాగుంటుందని అంటున్నారు. అయితే దీనిపై ఇంత వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత భూముల విలువలు పెరిగిపోవడంతో వివాదాలు మరింతగా పెరిగాయి. రికార్డుల గందరగోళం, హద్దులలో అస్పష్టత, రకరకాలైన భూముల కారణంగా హత్యలకు దారి తీశాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొలుత భూ రికార్డుల ప్రక్షాళన నిర్వహించారు. అయినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదు. ఆ తరువాత ధరణి వెబ్ పోర్టల్ తీసుకువచ్చినా సమస్యలు మరింత రెట్టింపు అయ్యాయి. దీనికోసం ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ పట్టాదార్ పాస్ బుక్ యాక్ట్ ను 2020 లో తీసుకువచ్చింది. 196 చట్టాలను వంద చట్టాలకు కుదించిన విషయం తెలిసిందే. ధరణి వెబ్ పోర్టల్ లో అనుభవంలో ఉన్న యజమానుల పేర్లు కాకుండా దశాబ్ధాల క్రితం నాటి భూముల యజమానుల పేర్లు చాలా ప్రాంతాల్లో నమోదు అయ్యాయి. కొనుగోలు చేసిన వారి పేర్లు అందులో లేకపోవడంతో పలువురు ఇప్పటికీ మండల తహశీల్దార్, సీసీఎల్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. న్యాయం లభించకపోవడంతో చాలా మంది కోర్టులను ఆశ్రయించారు. లక్షలాది ఎకరాల ప్రభుత్వ, అసైన్డు, దేవాదాయ, భూదాన్, వక్ఫ్ భూములకు రెక్కలొచ్చి పట్టా భూములుగా మారాయి. ధరణి పుణ్యమా అని రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారి పాస్ బుక్‌లు కూడా వచ్చాయి. ఇలాంటి అనుమానిత లావాదేవీలపై విచారణ జరిపేందుకు ఫోరెన్సిక్ విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. వివాదాస్పద భూముల లావాదేవీలకు సంబంధించి అక్రమాలను వెలికితీసేందుకు విచారణ చేయిస్తామని చెప్పి రెండేళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు విచారణకు ఆదేశించలేదు.

ఈ సమస్యలన్నింటికి ముగింపు పలికేందుకు తెలంగాణ కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రిటైర్డు రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం భూములకు సంబంధించి 100 కు పైగా చట్టాలు అమలు చేస్తున్నారు. ఈ చట్టాలను ఒకే గొడుగు కిందకి తీసుకురావడం మూలంగా అయోమయానికి తెరపడుతుందంటున్నారు. ధరణి కమిటీ కూడా ఇదే అభిప్రాయంతో ఉందని గుర్తు చేస్తున్నారు

ఏపీలో రిజిస్ట్రేషన్ల రద్ధు అధికారం జిల్లా కలెక్టర్లకు

Read Also |

Prohibited Lands | నిషేధిత భూములపై తర్జన భర్జన.. సీసీఎల్ఏకు చేరుకున్న జాబితా!
NRI lands Encroached | ఎన్‌ఆర్‌ఐల భూములు భద్రమేనా? వారికి భరోసా ఇచ్చేదెవరు?