Site icon vidhaatha

వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

విధాత : రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాల కూల్చివేతల అంశంలో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కూల్చివేతల్లో చట్ట నిబంధనలు పాటించాలని ఆదేశిస్తూ స్టేటస్ కో విధించింది. అధికారులు కూల్చివేతలపై తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకొవద్దని ఆదేశించింది.

ప్రతిదశలో వైసీపీ తరపున వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని పేర్కొంది. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఉన్న సందర్భంలో కూల్చివేతలపై ఆలోచన చేయాలని సూచించింది. తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ పలువురు వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టి ఈ మేరకు మధ్యతర ఉత్తర్వులు జారీ చేసింది.

Exit mobile version