Cyclone effect | ఏపీకి పొంచివున్న తుపాను ముప్పు.. అప్రమత్తం చేసిన వాతావరణ కేంద్రం

Cyclone effect | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నదని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఇది క్రమంగా అల్పపీడనంగా మారి రానున్న 72 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

  • Publish Date - June 28, 2024 / 11:07 AM IST

Cyclone effect : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్నదని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, ఇది క్రమంగా అల్పపీడనంగా మారి రానున్న 72 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దాని ప్రభావంతో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

వాతావరణం కేంద్రం హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ముప్పును ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. మత్స్యకారులు చేపలకు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తీరా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని సూచించారు.

తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, , పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.

Latest News