మన్యం జిల్లాకు కుంకీ ఏనుగులు..పవన్ కల్యాణ్ ఘన స్వాగతం

విజయనగరం, మన్యం జిల్లాల్లో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు చేపట్టనున్న ఆపరేషన్ కు వెలుతున్న రెండు కుంకీ ఏనుగులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ తన క్యాంప్ ఆఫీస్ వద్ద ఘన్ స్వాగతం పలికారు.

విజయనగరం, మన్యం జిల్లాల్లో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు చేపట్టనున్న ఆపరేషన్ కు వెలుతున్న రెండు కుంకీ ఏనుగులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ తన క్యాంప్ ఆఫీస్ వద్ద స్వాగతం  పలికారు. పలమనేరు నుంచి మన్యం జిల్లాకు వెళ్తున్న కుంకీ ఏనుగులు మంగళగిరికి చేరుకున్న సందర్బంగా పవన్ స్వాగతం పలికారు. భుజానికి ఆపరేషన్ అయినా సరే లెక్కచేయకుండా.. పార్వతీపురం వెళ్తున్న కుంకీ ఏనుగులకు స్వాగతం పలికిన పవన్ కల్యాణ్ వాటికి చెరుకు గెడల్ని ఆహారంగా అందించారు. కుంకీలు జయంత్, అభిమన్యుకు పూలమాలలు వేశారు.

పార్వతీపురం మన్యం జిల్లాలోని గుచ్చిమి క్యాంపునకు వెళ్తున్న రెండు కుంకీల ఏనుగులను అక్కడి నుంచి అడవి ఏనుగులు సంచరించే ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని కట్టడి చేసేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. జయంత్, అభిమన్యులకు గతంలో ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఉంది. అందుకే ముందుగా వాటిని అక్కడికి పంపిస్తున్నారు. ఒడిశా నుంచి అడవి ఏనుగులు వచ్చి పంటపొలాల్ని ధ్వంసం చేస్తున్నాయని, అక్కడి ప్రభుత్వంతో కూడా చర్చలు జరపాలని పవన్ కల్యాణ్‌ అటవీశాఖ అధికారులను ఆదేశించారు.

ఒడిశా నుంచి కూడా కొన్ని కుంకీ ఏనుగుల్ని రప్పించి అడవి ఏనుగుల్ని నియంత్రించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈలోగా మనవద్ద ఉన్న కుంకీలతో వీలైనంతమేర అడవి ఏనుగుల్ని అడవిలోకి పంపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మన్యం జిల్లాల్లో పంటపొలాల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల గుంపుని కట్టడి చేసేందుకు కుంకీ ఏనుగుల్ని పంపిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ తెలిపారు.

 

Latest News