Chandra Babu | ఈ ఎన్నికల్లో 100 శాతం టీడీపీదే విజయం : చంద్రబాబు నాయుడు

Chandra Babu | ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం టీడీపీదే విజయమని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంత భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు తరలిరావడాన్ని తాను తన రాజకీయ జీవితంలోనే చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి బెంగళూరు, చెన్నై రాష్ట్రాల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివచ్చారని ఆయన చెప్పారు.

  • Publish Date - May 13, 2024 / 09:53 AM IST

Chandra Babu : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నూటికి నూరు శాతం టీడీపీదే విజయమని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంత భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు తరలిరావడాన్ని తాను తన రాజకీయ జీవితంలోనే చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి బెంగళూరు, చెన్నై రాష్ట్రాల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివచ్చారని ఆయన చెప్పారు. ఓటు వేడయం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. గుంటూరులోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, వారి భవిష్యత్తును కాపాడుకునేందుకు ఓటర్లు ఇంత భారీ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. విదేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆంధప్రదేశ్‌ ఓటర్లు తమ సొంత ఖర్చులతో తరలివచ్చి ఓటు వేస్తున్నారని ఆయన చెప్పారు. కాగా ఇవాళ ఏపీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

అందులో తెలంగాణకు చెందిన మొత్తం 17 లోక్‌సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొత్తం 25 లోక్‌సభ స్థానాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా యూపీలో 13 స్థానాలకు, మహారాష్ట్రలో 11 లోక్‌సభ స్థానాలకు, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఎనిమిదేసి లోక్‌సభ స్థానాలకు, బీహార్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలకు, జార్ఖండ్‌, ఒడిశా రాష్ట్రాల్లో నాలుగేసి లోక్‌సభ స్థానాలకు, జమ్ముకశ్మీర్‌లో ఒక లోక్‌సభ స్థానానికి లోక్‌సభ నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగుతోంది.

Latest News