Site icon vidhaatha

ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ సలహాదారు గా బొంతు రాజేశ్వరరావు

విధాత‌:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ సలహాదారు గా బొంతు రాజేశ్వరరావు బాద్యతలు చేపట్టారు. విజయవాడ లో శుక్రవారం అట్టహాసం గా జరిగిన కార్యక్రమం లో అయన పదవి స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడు తూ ప్రజలు అందరికి పరి శుభ్ర మైన తాగు నీరు అందించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కృత నిశ్చయం తో వున్నారని పేర్కొన్నారు. సీఎం ఆశయం మేరకు తాను పనిచేస్తా నని అన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలం సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, MLA లు, వివిధ కార్పొరేషన్ ల చైర్మన్ లు, అభిమానులు, వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version