తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన పాలక మండలి ఏర్పాటైంది. నూతన ఛైర్మన్‌గా ఏపీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు. టివి5 చానెల్ అధినేత బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యుల(24 members)తో టిటిడి పాలకమండలి(TTD Board) నెలకొననుంది. ఈ మేరకు టిటిడి అధికారిక ప్రకటన విడుదల చేసింది.
తితిదే బోర్డు సభ్యులు వీరే..
ఆంధ్రప్రదేశ్:
- జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
- వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే)
- ఎం.ఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
- పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి)
- జాస్తి పూర్ణ సాంబశివరావు
- శ్రీసదాశివరావు నన్నపనేని
- కోటేశ్వరరావు
- మల్లెల రాజశేఖర్ గౌడ్
- జంగా కృష్ణమూర్తి
- శాంతారామ్
- జానకీ దేవి తమ్మిశెట్టి
తెలంగాణ
- నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ)
- బూంగునూరు మహేందర్ రెడ్డి (తెలంగాణ)
- అనుగోలు రంగశ్రీ (తెలంగాణ)
- బూరగాపు ఆనందసాయి (తెలంగాణ)
- సుచిత్ర ఎల్లా (తెలంగాణ)
తమిళనాడు
- కృష్ణమూర్తి ( తమిళనాడు)
- పి.రామ్మూర్తి (తమిళనాడు)
కర్ణాటక:
- నరేశ్‌కుమార్ ( కర్ణాటక)
- దర్శన్. ఆర్.ఎన్ (కర్ణాటక)
- జస్టిస్ హెచ్ఎల్ దత్ (కర్ణాటక)
- డా.అదిత్ దేశాయ్ (గుజరాత్)
- సౌరభ్ హెచ్ బోరా (మహారాష్ట్ర)
సభ్యుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు కాగా, తెలంగాణ(Telangana) నుండి ఐదుగురి(five)కి చోటు కల్పించారు. కర్ణాటక(Karnataka)కు చెందిన ముగ్గురి(Three)ని, తమిళనాడు(Tamilnadu) నుండి ఇద్దరి(Two)ని నియమించారు. గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరు మండలిలో ఉన్నారు.