బిచ్చగాడిగా అవతారమెత్తిన నటుడు.. నెలకు రూ. 8 లక్షల సంపాదన..!
అతనో ప్రొఫెషనల్ యాక్టర్. కానీ బిచ్చగాడిగా అవతారమెత్తాడు. ఆ అవతారంలో ఒదిగిపోయాడు. తాను నటుడి అన్న విషయం మరిచిపోయి.. అది కూడా ఎవరు గుర్తు పట్టకుండా ఉండేలా బిచ్చగాడిగా మారిపోయాడు. ఇక ఓ పర్యాటక ప్రాంతం వద్ద భిక్షాటన చేస్తూ నెలకు రూ. 8 లక్షలు సంపాదిస్తున్నాడు.

అతనో ప్రొఫెషనల్ యాక్టర్. కానీ బిచ్చగాడిగా అవతారమెత్తాడు. ఆ అవతారంలో ఒదిగిపోయాడు. తాను నటుడి అన్న విషయం మరిచిపోయి.. అది కూడా ఎవరు గుర్తు పట్టకుండా ఉండేలా బిచ్చగాడిగా మారిపోయాడు. ఇక ఓ పర్యాటక ప్రాంతం వద్ద భిక్షాటన చేస్తూ నెలకు రూ. 8 లక్షలు సంపాదిస్తున్నాడు. అక్కడున్న బిచ్చగాళ్లల్లో సంపన్న బిచ్చగాడిగా మారిపోయాడు ఆ నటుడు. మరి ఆ బిచ్చగాడి గురించి తెలుసుకోవాలంటే చైనా వెళ్లక తప్పదు.
చైనాకు చెందిన లు జింగ్‌జాంగ్ స్థానికంగా మంచి నటుడు. కానీ ఆ జీవితాన్ని వదిలేసి.. భిక్షాటన వైపు వచ్చాడు. గత పన్నేండ్ల నుంచి భిక్షాటన చేస్తున్నాడు. చైనా హెనాన్ ప్రావిన్స్‌లోని కింగ్‌మింగ్ షాంఘే గార్డెన్ పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ జింగ్ జాంగ్ భిక్షాటన చేస్తూ నెలకు రూ. 8 లక్షలు సంపాదిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో అతనికి డబ్బులే కాకుండా, ఆహారం, పానీయాలు కూడా పర్యాటకులు ఇచ్చి వెళ్తుంటారు. అయితే భిక్షాటన చేసే సమయానికి అతను పూర్తిగా మారిపోతాడు. మురికిగా ఉండి చిరిగిన దుస్తులు ధరించి, ముఖానికి కాస్త దుమ్ము అంటించుకుని బయల్దేరుతాడు. ఇక విషాదకరమైన ముఖంతో ఆ భిక్షాటనలో పూర్తిగా ఒదిగిపోయి ఇప్పటికే కొన్ని కోట్ల ధనం వెనుకేశాడు జింగ్‌జాంగ్.
జింగ్‌జాంగ్ నెలకు రూ. 8 లక్షలు సంపాదిస్తున్నాడు. చైనా బిచ్చగాళ్లల్లో జింగ్‌జాంగ్ అత్యంత సంపన్నుడు అని తేలింది. అయితే చైనాలో ఉద్యోగం చేస్తే అత్యధికంగా రూ. 3 లక్షల జీతం ఇస్తారు. కానీ సగటు ఉద్యోగి కంటే జింగ్ జాంగ్ రెండింతలు అధికంగా సంపాదిస్తున్నాడు.