తెలుగింటి సీత‌మ్మ విడాకులు తీసుకున్న నిర్మాత‌ని పెళ్లి చేసుకోబోతుందా..!

తెలుగింటి సీత‌మ్మ విడాకులు తీసుకున్న నిర్మాత‌ని పెళ్లి చేసుకోబోతుందా..!

ఒక‌ప్పుడు హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన అంజ‌లి త‌న అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. షాపింగ్ మాల్ సినిమా ద్వారా ఇండ‌స్ట్రీకి పరిచయం అయిన తెలుగందం వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన కూడా నటించింది. ఈ అమ్మడు ఆ మధ్య విడుదలైన వకీల్ సాబ్ చిత్రంలో జరీనా పాత్రలో అద్భుతమైన నటన క‌న‌బ‌రిచి శ‌భాష్ అనిపించుకుంది. ప్ర‌స్తుతం హీరోయిన్ పాత్ర‌లు ద‌క్క‌క‌పోవ‌డంతో స‌పోర్టింగ్ రోల్స్‌లో అద‌ర‌గొడుతుంది. రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న గేమ్ ఛేంజ‌ర్ చిత్రంలోను అంజ‌లి కీల‌క పాత్ర పోషిస్తుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లోను అవ‌కాశాలు అందిపుచ్చుకుంటుంది అంజ‌లి

ఈ అమ్మ‌డి పెళ్లికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. అంజలి ‘జర్నీ సినిమాలో త‌న‌తో కలిసి నటించిన హీరో జైతో కొన్నాళ్ల‌పాటు ప్రేమాయ‌ణం సాగించింది. అత‌నితో పెళ్లి పీట‌లు ఎక్క‌డం ఖాయం అని అంద‌రు అనుకున్నా తామిద్దరం స్నేహితుల‌మ‌ని చెప్పి ప్ర‌చారానికి ముగింపు ప‌లికారు. ఆ త‌ర్వాత ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ప్రేమ విష‌యం గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ఓ వ్యక్తితో ఉన్న రిలేషన్ షిప్ వల్ల కెరీర్ పై దృష్టి పెట్టలేకపోతున్నానని, ఆ సంబంధం రాంగ్ రిలేషన్ షిప్ అని చెప్పింది. ఆ రిలేష‌న్ షిప్ వ‌ల‌న కెరీర్‌పై దృష్టి పెట్ట‌లేక‌పోతున్నాన‌ని కూడా తెలియ‌జేసింది.

రీ ఎంట్రీలో వరుస సినిమాలు చేస్తున్న అంజలి త్వ‌ర‌లో విడాకులు తీసుకున్న వ్య‌క్తిని పెళ్లి చేసుకోబోతుందంటూ ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. విడాకులు తీసుకున్న తెలుగు నిర్మాత‌తో అంజ‌లి కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తుందని, వీలైనంత ఎర్లీగానే అత‌డిని పెళ్లి చేసుకోనుంద‌ని టాక్ న‌డుస్తుంది. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది, దీనిపై అంజ‌లి ఏమైన స్పందిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. గ‌తంలో త‌న పెళ్లిగ గురించి ఇలాంటి రూమర్లు రాగా, వాటికి ఓసారి ఘాటుగా సమాధానం చెప్పింది అంజలి..