Site icon vidhaatha

Betting Effect: బెట్టింగ్ భూతానికి మరో యువకుడి బలి!

Betting Effect: తెలంగాణలో బెట్టింగ్ భూతం వందల మంది ప్రాణాలు బలిగొంటున్నది. ఈ దఫా క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలి అయ్యాడు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని సోమేశ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధి గౌడవెల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది.

గుండ్లపోచంపల్లికి చెందిన సోమేశ్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకుని మనోవేదనతో రైలు పట్టాలపై పడుకు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా స్థానికుల కథనం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల పెద్దపల్లి జిల్లా సింగిరెడ్డి పల్లెలో బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి.. మోసపోయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంథని మండలం విలోచవరంకు చెందిన సాయి తేజ గోదావరిఖని డయోగ్నోస్టిక్ సెంటర్ లో పని చేస్తున్నాడు.10 లక్షల రూపాయలు అప్పుచేసి బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నాడు. అప్పులు తీర్చలేక ఈనెల 18 న సింగిరెడ్డి పల్లెలో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇప్పుడు మరో యువకుడు బెట్టింగ్ వ్యసనానికి బలయ్యాడు.

ఆన్ లైన్ బెట్టింగ్  యాప్ ల కారణంగా దాదాపుగా 800మంది వరకు ప్రాణాలు కోల్పోయారని ఓ వైపు పోలీసులు రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ లపై ఉక్కు పాదం మోపుతూ…ప్రమోషన్ చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయర్స్ పైన, సెలబ్రెటీలపైన కేసులు నమోదు చేపట్టింది. అయితే ఐపీఎల్ ముసుగులో సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ యాప్ లపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో యువత క్రికెట్ బెట్టింగ్ లతో నష్టపోతు విలువైన ప్రాణాలు కోల్పోతు కుటుంబాలను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పోలీస్ శాఖ, ప్రభుత్వాలు క్రికెట్ బెట్టింగ్ లపై కూడా దృష్టి పెట్టి యువత నష్టపోకుండా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తుంది.

Exit mobile version